Home /News /movies /

TOLLYWOOD ACTRESS POORNA BITES A DANCERS CHEEK IN ETV DHEE SHOW PROMO GOES VIRAL NR

Dhee - Poorna: ఢీ వేదికపై రెచ్చిపోయిన జడ్జి పూర్ణ.. ఏకంగా అతడి బుగ్గ కొరుకుతూ.. వామ్మో!

Actress poorna

Actress poorna

Dhee - Poorna: బుల్లితెరలో ఎన్నో రకాల ఎంటర్టైన్మెంట్ షోలు ప్రసారమవుతున్నాయి. ఇక ఈ మధ్య మరిన్ని షోలు ప్రారంభం కాగా అందులో పాల్గొనే సెలబ్రెటీలు, యాంకర్లు, జడ్జీలు మాత్రం ఓ రేంజ్ లో హద్దులు దాటుతున్నారు.

    Dhee - Poorna: బుల్లితెరలో ఎన్నో రకాల ఎంటర్టైన్మెంట్ షోలు ప్రసారమవుతున్నాయి. ఇక ఈ మధ్య మరిన్ని షోలు ప్రారంభం కాగా అందులో పాల్గొనే సెలబ్రెటీలు, యాంకర్లు, జడ్జీలు మాత్రం ఓ రేంజ్ లో హద్దులు దాటుతున్నారు. తమ నోటికి వచ్చిన డబల్ మీనింగ్ డైలాగులతో, హగ్ లతో, ముద్దులతో బాగా రెచ్చిపోతున్నారు. నిజానికి ఒకప్పటి షోలు ఇలాగా ఉండేవి కావు. పైగా అప్పట్లో మంచి వస్త్రధారణలు, ప్రేక్షకులను ఆకట్టుకునే మాటలు, ఆటలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు అవన్నీ లేవనే చెప్పవచ్చు. నిజానికి వాటికి బదులు రెట్టింపు స్పైసీలను కలుపుతున్నారనే చెప్పవచ్చు.

    నిజానికి షోలో చేసే పర్ఫామెన్స్ ఒకటైతే అందులో పాల్గొనే కంటెస్టెంట్ లు చేసే పర్ఫామెన్స్ లు మాత్రం వేరొకటిగా ఉంటాయి. ఇదిలా ఉంటే ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షో గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎన్నో సీజన్ లు పూర్తవగా ప్రస్తుతం మరో సీజన్ తో బాగా రెచ్చిపోతుంది. ఇందులో ప్రదీప్ యాంకర్ గా చేయగా.. ప్రియమణి, శేఖర్ మాస్టర్, పూర్ణలు జడ్జీలుగా చేస్తున్నారు. అంతేకాకుండా సుడిగాలి సుధీర్- రష్మీ, హైపర్ ఆది- దీపిక పిల్లి లు టీమ్ లీడర్ గా చేస్తూ జంటలుగా మరింత ఓవర్ చేస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా ఇందులో జడ్జి పూర్ణ ఏకంగా ఓ డాన్సర్ బుగ్గ కొరుకుతూ బాగా రెచ్చిపోయింది.



    ఢీ షోకి సంబంధించిన వచ్చే ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా అందులో యాంకర్, టీమ్ లీడర్లు తమ పంచ్ లతో బాగా సందడి చేశారు. ఇక ఇందులో ఓ డాన్సర్ బేబీ గెటప్ లో 'మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు' అనే పాటతో పర్ఫామెన్స్ చేశాడు. ఇక అందులో ఆ డాన్సర్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంతో డాన్స్ అయిపోయిన వెంటనే పూర్ణ వెంటనే వేదిక పైకి వెళ్లి ఆ డాన్సర్ మెత్తని బుగ్గలు కొరికింది. దీంతో ఈ సీన్ అందర్నీ షాక్ అయ్యేలా చేయగా.. ఈ ప్రోమోని చూసిన నెటిజన్లు హగ్, ముద్దులు అయిపోయాయి ఇక కొరకడాలు మొదలు పెట్టారుగా అంటూ నెగటివ్ కామెంట్స్ తో విమర్శలు చేస్తున్నారు.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Actress poorna, Dhee show, Etv show, Priyamani, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు