చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చిన పూనమ్ కౌర్ (Poonam Kaur).. సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈమె నటించిన ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాను మాట్లాడిన మాటలను పూర్తిగా వక్రీకరించి రాసారంటూ మీడియాపై చిందులు తొక్కారు. కొన్నేళ్ల గ్యాప్ తీసుకుని ఈమె నటించిన సినిమా నాతిచరామి (Nathicharami movie). నాగు గవర (Nagu Gavara) తెరకెక్కించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్‌లోనే జరిగింది. ఇందులో చిత్రయూనిట్ అంతా పాల్గొన్నారు. ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో పూనమ్ కౌర్ కాస్త ఎమోషనల్ అయింది. ఇదే అదునుగా కొందరు యూ ట్యూబర్లు (YouTube Channels) రెచ్చిపోయారు.
ఈమె ఫొటోలను వాడుకోవడమే కాకుండా.. కాస్త మార్ఫింగ్ కూడా చేసి ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా చూపించి చిత్రవిచిత్రమైన థంబ్ నెయిల్స్ అన్నీ సృష్టించారు. దాంతో ఇప్పుడు వాళ్లపై నాతిచరామి టీమ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ యూ ట్యూబర్లకు వార్నింగ్ ఇచ్చింది. ఎవరెవరైతే తనపై ఇలాంటి అసభ్యకరమైన థంబ్ నెయిల్స్ అన్నీ పెట్టారో వాళ్లకు వార్నింగ్ ఇచ్చింది పూనమ్ కౌర్. ఈ క్రమంలోనే ఓ లేఖను కూడా విడుదల చేసారు టీమ్.
యూ ట్యూబ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం.. తాజాగా జరిగిన నాతిచరామి మూవీ ప్రెస్ మీట్ వీడియోలపై ఎవరైతే అసభ్యకరంగా థంబ్ నెయిల్స్ వాడారో.. వాళ్లందరీ థంబ్ నెయిల్స్ స్క్రీన్ షాట్స్ తీసి పెట్టాము.. సో మాట్లాడని విషయాలను వక్రీకరించి థంబ్ నెయిల్స్ పెట్టిన అందరిపైనా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం అంటూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసారు. ఈ ప్రెస్ మీట్‌లో పూనమ్ కౌర్ కాస్త ఎమోషనల్ అయింది. దాంతో అవే ఫొటోలను వాడుకుని.. "నేను పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్ళిపోతా అనుకున్నా", "ఆడదాన్ని అలా నాశనం చేస్తే వాడు నాశనం అయిపోతాడు" అంటూ ఫేక్ థంబ్ నెయిల్స్‌తో కొన్ని యూ ట్యూబ్ ఛానెల్స్‌తో వార్తలు వచ్చాయి. వీటిపై ఇప్పుడు పూనమ్ సీరియస్ అయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Poonam kaur, Telugu Cinema, Tollywood