షాద్‌నగర్ ఎన్కౌంటర్ పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సెలబ్రిటీలు సైతం ఈ ఘటనను స్వాగతిస్తూ ట్వీట్లు, మెసేజులు పెడుతున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ పూనం కౌర్ కూడా ఎన్‌కౌంటర్‌పై స్పందిస్తూ ట్వీట్ చేేసింది. ‘దిశకు న్యాయం చేసినందుకు తెలంగాణ పోలీసులకు, ప్రభుత్వానికి థ్యాంక్స్. ఇలాగే నాలా పలువురు మహిళల్ని మోసం చేసిన కొంతమంది సిని అలియాస్ రాజకీయ నాయకుల్ని కూడా శిక్షిస్తారని భావిస్తున్నాను. ప్లీజ్ రెండు బెత్తం దెబ్బలు.’ అంటూ ఆమె ట్వీట్ చేసింది. అయితే ఆ ట్వీట్ పెట్టిన కాసేపటికే మళ్లీ డిలీట్ కూడా చేసింది.
పూనమ్ ట్వీట్
అయితే పూనం తాను చేసిన ట్వీట్‌ను డిలీట్ చేసిన లోపే.. అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.తనతోపాటు పలువురి మహిళలను మోసం చేసిన సినీ అలియాస్ రాజకీయ నాయకులను కూడా శిక్షిస్తారని భావిస్తున్నానని పేర్కొన్న పూనం.. ప్లీజ్ రెండు బెత్తం దెబ్బలు అని చెప్పడంతో అది పవన్ కల్యాణ్ పై మీదేనని పేర్కొంది. దిశ ఘటనపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఇటీవల మాట్లాడుతూ నిందితులకు రెండు బెత్తం దెబ్బలు చాలని వ్యాఖ్యానించారంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు అవే మాటలను పూనం ఉపయోగించడంపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.