హోమ్ /వార్తలు /సినిమా /

Pooja Hegde: షాకింగ్.. బుట్ట బొమ్మకు కరోనా పాజిటివ్!

Pooja Hegde: షాకింగ్.. బుట్ట బొమ్మకు కరోనా పాజిటివ్!

pooja hegde

pooja hegde

Pooja Hegde: ప్రస్తుతం దేశం మొత్తం కరోనా సెకండ్ వేవ్ తో అల్లకల్లోలంగా మారింది. రోజుకు లక్షల సంఖ్యలో కేసులు, ఎన్నో మరణాల సంఖ్యలు బయట పడుతున్నాయి.

  Pooja Hegde: ప్రస్తుతం దేశం మొత్తం కరోనా సెకండ్ వేవ్ తో అల్లకల్లోలంగా మారింది. రోజుకు లక్షల సంఖ్యలో కేసులు, ఎన్నో మరణాల సంఖ్యలు బయట పడుతున్నాయి. ఇక ఇప్పటికే వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో బంద్, లాక్ డౌన్ వంటివి ప్రకటించారు. ఎంతో వేగంగా వస్తున్న ఈ వైరస్ తీవ్రత ను చూసి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.


  ఇక సినీ పరిశ్రమలో ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ మొత్తం వైరస్ తో నిండి పోయిందనే చెప్పవచ్చు. ఇప్పటికీ ఎంతోమంది నటీనటులు, దర్శక నిర్మాతలు, సినీ బృందాలు వైరస్ బారిన పడ్డారు. ఇక వైద్యుల సూచనలతో చికిత్స తీసుకుంటున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వైరస్ నుండి రక్షణ కోసం జాగ్రత్తలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరో నటి కి కరోనా పాజిటివ్ తేలింది.


  టాలీవుడ్ నటి పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాకుండా మోస్ట్ బ్యాచిలర్ సినిమాల్లో కూడా నటిస్తుంది. ఇక బాలీవుడ్ లో, తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా తనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపింది.


  pooja hegde
  pooja hegde

  అంతేకాకుండా ప్రస్తుతం ఆమె సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండగా ఇటీవల తనతో ఉన్న వాళ్ళని టెస్టు చేయించుకోమని కోరింది. ఇక అభిమానులు చూపిస్తున్న ప్రేమ, నమ్మకం ధైర్యాన్ని నిలుపుతాయని కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాకుండా వైరస్ నుండి మంచిగా కోలుకుంటానని తెలిపింది. ఇక అందరినీ ఇంట్లో ఉంటూ, జాగ్రత్తగా ఉండమని కోరింది. ఇక ప్రస్తుతం వైరస్ నేపథ్యంలో వరుస సినిమాలకు దూరంగా ఉంది.

  Published by:Navya Reddy
  First published:

  Tags: Bollywood, Corona virus, Covid-19, Kollywood, Naga chaithanya, Okalaila kosam movie, Pooja Hegde, Tollywood, Vijay movie

  ఉత్తమ కథలు