హోమ్ /వార్తలు /సినిమా /

Pooja Hegde: పూజా హెగ్డే ఇంట్లో తీవ్ర విషాదం.. కన్నీటి పర్యంతం అవుతున్న బుట్టబొమ్మ..

Pooja Hegde: పూజా హెగ్డే ఇంట్లో తీవ్ర విషాదం.. కన్నీటి పర్యంతం అవుతున్న బుట్టబొమ్మ..

పూజా హెగ్డే (Instagram/Photo)

పూజా హెగ్డే (Instagram/Photo)

Pooja Hegde: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇదే విషయం అభిమానులతో పంచుకుంది ఈమె. కన్నీటితో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తాను చిన్నప్పటి నుంచి ఎంత‌గానో ప్రేమించే బామ్మ తనకు లేదని..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇదే విషయం అభిమానులతో పంచుకుంది ఈమె. కన్నీటితో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తాను చిన్నప్పటి నుంచి ఎంత‌గానో ప్రేమించే బామ్మ తనకు లేదని.. ఆమె భౌతికంగా దూరం అయిపోయిందని కన్నీటి పర్యంతం అవుతుంది బుట్టబొమ్మ. తమ కుటుంబాన్ని దుఃఖ సాగ‌రంలో ముంచేస్తూ బామ్మ తమను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయిందని చెప్పుకొచ్చింది. బామ్మ చనిపోయింద‌నే విష‌యాన్ని పూజా హెగ్డే త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు.. బామ్మ గురించి ఎమోషనల్‌గా రాసుకొచ్చింది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ క్యూటీని మేం కోల్పోయాం.. నువ్వు ఎక్క‌డ ఉన్నా సంతోషంగా ఉంటావని.. హాయిగా ఎలాంటి బాధ‌లు లేకుండా ఉంటావని ఆశిస్తున్నాను.. క‌ష్టాలలో ఉన్నా న‌వ్వుతూనే ఉండాల‌ని నువ్వే మాకు నేర్పించావు అంటూ బామ్మను తలుచుకుని బాధ పడింది పూజా హెగ్డే. ధైర్యంగా ఉండ‌టం.. కావ‌ల‌సిన వాళ్ల కోసం ఈగోల‌ను ప‌క్క‌న పెట్ట‌డం అన్ని నేర్పించింది కూడా తన బామ్మే అంటూ చెప్పుకొచ్చింది పూజా. చనిపోయినా కూడా తన బామ్మ ఎప్పుడు తనతోనే ఉంటుందని.. ల‌వ్ యూ ఆజీ అంటూ ఎమోషనల్ అయింది పూజా హెగ్డే. షూటింగ్ స‌మ‌యంలో కాల్స్ చేసి ఏం చేస్తున్నావు.. ఎలా ఉన్నావు అని నువ్వడిగే ప్ర‌శ్ప‌లు ఇప్పట్నుంచి రావు అని తెలిసిన క్షణం నుంచి కన్నీళ్లు వస్తున్నాయని చెప్పింది. ఆ ఫోన్ కాల్స్ తప్పకుండా మిస్ అవుతానని.. ఆత్మ‌క శాంతి చేకూరాల‌ని మ‌న‌స్పూర్తిగా ప్రార్ధిస్తున్నాను అని పూజా హెగ్డే పేర్కొంది.

pooja hegde,pooja hegde twitter,pooja hegde instagram,pooja hegde grandmother passed away,pooja hegde grandmother death,pooja hegde emotional note on grandmother death,telugu cinema,pooja hegde hot photos,pooja hegde radhe shayam,pooja hegde movies,పూజా హెగ్డే,పూజా హెగ్డే కుటుంబంలో విషాదం,పూజా హెగ్డే బామ్మ కన్నుమూత
Pooja Hegde (బామ్మతో పూజా హెగ్డే)

ప్రస్తుతం తెలుగులో చాలా బిజీగా ఉంది పూజా. ప్రభాస్ రాధే శ్యామ్, అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు హిందీలో కూడా పూజా హెగ్డే బిజీగా ఉంది. అక్కడ కూడా వరస సినిమాలు చేస్తుంది పూజా.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Pooja Hegde, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు