• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • TOLLYWOOD ACTRESS PIA BAJPIEE BROTHER PASSED AWAY DUE TO COVID 19 AND ACTRESS EMOTIONAL TWEET GOING VIRAL PK

Pia Bajpiee: కరోనాతో కన్నుమూసిన హీరోయిన్ సోదరుడు.. వెంటిలేటర్ కోసం చూస్తుండగానే విషాదం..

Pia Bajpiee: కరోనాతో కన్నుమూసిన హీరోయిన్ సోదరుడు.. వెంటిలేటర్ కోసం చూస్తుండగానే విషాదం..

పియా బాజ్‌పెయి ఫైల్ ఫోటోస్ (Source: Instagram/ Pia Bajpiee)

Pia Bajpiee: కరోనాకు చిన్నాపెద్దా తేడా లేదు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు హీరోయిన్ పియా బాజ్‌పెయీ సోదరుడు కూడా చనిపోయారు. కళ్ల ముందే ఆక్సీజన్ దొరక్క ప్రాణాలు కోల్పోయారు ఈయన. ఉత్తర ప్రదేశ్‌లో ఈ విషాదకరమైన ఘటన జరిగింది.

  • Share this:
కరోనాకు చిన్నాపెద్దా తేడా లేదు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రముఖులు కూడా చాలా మంది అత్యంత విషాదంలో ముంచేస్తూ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. తాజాగా మరో ప్రముఖ హీరోయిన్ సోదరుడు చూస్తుండగానే కళ్ల ముందు ఆక్సీజన్ దొరక్క ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు హీరోయిన్ పియా బాజ్‌పెయీ సోదరుడు కూడా చనిపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలో తన సోదరుడికి కరోనా సోకి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అతడు చనిపోవడానికి కొన్ని గంటల ముందే ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు పియా. తన సోదరుడి పరిస్థితి విషమంగా ఉందని.. దయచేసి ఎవరైనా సాయం చేసి వెంటిలేటర్‌, బెడ్‌ అరేంజ్ చేయాలని కోరారు. ఉదయం 6.24 నిమిషాలకు ఈమె ట్వీట్ చేసారు.. అయితే రెండు గంటల తర్వాత అతడికి ఆక్సీజన్ లేక.. వెంటిలేటర్ దొరక్క 8.40 నిమిషాలకు మరణించారు. ఇదే విషయాన్ని బాధతో మై బ్రదర్ ఈజ్ నో మోర్ అంటూ మరో ట్వీట్ చేసారు. తన సోదరుడు కరోనాకు బలైపోయాడంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

చూస్తుండగానే తన కళ్ల ముందే ప్రాణాలు పోవడం చూసి ఈమె చలించిపోయారు. సోదరుడి మరణం తట్టుకోలేపోతున్నానంటూ కన్నీరు పెట్టుకున్నారు. కేవలం ఈమె మాత్రమే కాదు.. బాలీవుడ్ హీరోయిన్ భూమి ఫెడ్నేకర్ సైతం కేవలం 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు ఆప్తులను కోల్పోయానని.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ట్వీట్ చేసారు.

మరోవైపు హిందీ వెబ్ సిరీస్ కోసం షూటింగ్‌లో ఉన్న మరో నటుడు అనిరుధ్ డేవ్ సైతం కరోనా బారిన పడి భోపాల్‌లోని ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి కూడా విషమంగానే ఉంది. ఇక పియా బాజ్‌పెయీ విషయానికి వస్తే 2008లో తమిళంలో వచ్చిన పోయి సోల్లా పోరోమ్‌ సినిమాతో పరిచయం అయ్యారు.

ఆ తర్వాత దివంగత దర్శకుడు కేవీ ఆనంద్ సంచలన బ్లాక్‌బస్టర్ రంగంలోనూ పియా నటించారు. ఆ తర్వాత హిందీ వెబ్ సిరీస్‌లలో బిజీ అయిపోయారు. ఇలాంటి సమయంలో ఈమె తన సోదరుడిని కరోనాతో కోల్పోవడం పియా కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది. పలువురు సినీ ప్రముఖులు పియా కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: