హోమ్ /వార్తలు /సినిమా /

Meena daughter Nainika birthday: మీనా కూతురు నైనిక పుట్టిన రోజు వేడుకలు..

Meena daughter Nainika birthday: మీనా కూతురు నైనిక పుట్టిన రోజు వేడుకలు..

మీనా కూతురు నైనికా (meena Daughter nainika)

మీనా కూతురు నైనికా (meena Daughter nainika)

Meena daughter Nainika birthday: ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా ఇప్పుడు హాయిగా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. మధ్యలో మంచి కథలు వచ్చినపుడు సినిమాలు కూడా చేస్తుంది. ఇప్పుడు కూడా మోహన్ లాల్ సరసన దృశ్యం 2లో నటించింది మీనా.

ఇంకా చదవండి ...

ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా ఇప్పుడు హాయిగా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. మధ్యలో మంచి కథలు వచ్చినపుడు సినిమాలు కూడా చేస్తుంది. ఇప్పుడు కూడా మోహన్ లాల్ సరసన దృశ్యం 2లో నటించింది మీనా. ఈ చిత్రం త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈమె కూతురు నైనిక బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మధ్యే పుట్టిన రోజు జరుపుకుంది నైనిక. తన కూతురు బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో కూతురు గురించి పోస్టులు పెట్టింది మీనా. తన జీవితం.. తన ప్రేమ.. అన్నీ నైనికానే అంటూ పోస్ట్ చేసింది. హ్యాపీ బర్త్ డే టూ మై లైఫ్.. లవ్ అంటూ మీనా పెట్టిన పోస్టు వైరల్ అవుతుందిప్పుడు. మరోవైపు మీనా అభిమానులు ఈ పాపకు బర్త్ డే విషెస్ తెలిపారు. అంతేకాదు.. నైనిక తెలుగు ఆడియన్స్‌కు కూడా పరిచయమే. నాలుగేళ్ళ కింద వచ్చిన తెరీ సినిమాలో విజయ్ కూతురుగా నటించింది. ఆ సినిమాలో నటనకు గానూ అవార్డులు కూడా సొంతం చేసుకుంది నైనిక పాప. ఆ తర్వాత అవకాశాలు వచ్చినా కూడా చదువు పేరుతో దూరంగా ఉంది.


అచ్చంగా తల్లి మాదిరే ఉండే నైనికను చూసి దర్శక నిర్మాతలు కూడా ఫిదా అయిపోతున్నారు. మీనా కూడా బాలనటిగానే ఇండస్ట్రీకి వచ్చింది.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Meena, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు