Home /News /movies /

TOLLYWOOD ACTRESS MANCHU LAKSHMI WAHSTAPP HACKED SK

Manchu Lakshmi Whatsapp Hack: పండగ వేళ మంచు లక్ష్మికి షాక్.. వాట్సాప్ హ్యాక్

మంచు లక్ష్మి (Instagram/Photo)

మంచు లక్ష్మి (Instagram/Photo)

Manchu Lakshmi: వాట్సాప్ తెచ్చిన కొత్త యూజర్ డేటా ప్రైవసీ పాలిసీపై ఆందోళనల వ్యక్తమవుతున్న తరుణంలోనే మంచు లక్ష్మీ వాట్సాప్ హ్యాక్ కావడం చర్చనీయాంశమయింది.

    సంక్రాంతి పండగ వేళ మంచు లక్ష్మీకి బిగ్ షాక్ తగిలింది. ఆమె వాట్సప్‌ను గుర్త తెలియని సైబర్ కేటుగాళ్లు హ్యాక్ చేశారు. నిన్నటి నుంచి తన వాట్సాప్ ఓపెన్ కావడం లేదు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా అధికారికంగా వెల్లడించింది మంచు లక్ష్మీ. ''నా వాట్సప్‌ను ఎవరో హ్యాక్ చేశారు. నిన్నటి నుంచి ఏమీ రావడం లేదు.  ఇది మంచి విమోచనము. మళ్లీ కొత్తగా ప్రారంభిస్తాను’' అని ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం మంచు లక్ష్మీ తిరుపతిలో ఉన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ సంక్రాంతి పండగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందరూ పండగ ఉత్సాహంలో ఉన్న సమయంలోనే..ఈ షాకింగ్ అనుభం ఆమెకు ఎదురయింది.


    వాట్సాప్ తెచ్చిన కొత్త యూజర్ డేటా ప్రైవసీ పాలిసీపై ఆందోళనల వ్యక్తమవుతున్న తరుణంలోనే మంచు లక్ష్మీ వాట్సాప్ హ్యాక్ కావడం చర్చనీయాంశమయింది. ఆమె వ్యాట్సాప్ హ్యాకయిందన్న విషయం తెలిసి..చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. వాట్సాప్ నుంచి సిగ్నల్ యాప్‌కు మారండని ఎక్కువ మంది సూచిస్తున్నారు.


    ఐతే మంచు లక్ష్మీ వాట్సాప్‌ ఖాతాను ఎవరు హ్యాక్ చేశారు? ఎందుకు హ్యాక్ చేశారన్న వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై ఆమె సైబర్ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవలే ప్రముఖ యాంకర్, బిగ్‌బాస్ బ్యూటీ లాస్య యూట్యూబ్ ఛానెల్ కూడా హ్యాకయింది. సైబర్ నిపుణులు తీవ్రంగా శ్రమించి మళ్లీ ఆమె ఛానెల్‌ను తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అంతలోనే మళ్లీ ఇప్పుడు మంచు లక్ష్మి వాట్సాప్ ఖాతా కావడం టాలీవుడ్‌లో కలకలం రేపింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Manchu Family, Manchu Lakshmi, Tollywood, Whatsapp

    తదుపరి వార్తలు