TOLLYWOOD ACTRESS MANCHU LAKSHMI HOME TOUR AND SHE IS EXPERIENCE IN AMERICA HOME FIRE ACCIDENT NR
Manchu Lakshmi: అమెరికాలో నా ఇల్లు కాలిపోయినప్పుడు ఇది ఒక్కటే మిగిలింది: మంచు లక్ష్మి
Manchu Lakshmi
Manchu Lakshmi: తెలుగు సినీ నటి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి. ఈమె పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులకులందరికీ తెలిసిందే. మంచు ఫ్యామిలీ నుండి తొలి హీరోయిన్ గా పరిచయమైన
Manchu Lakshmi: తెలుగు సినీ నటి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి. ఈమె పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులకులందరికీ తెలిసిందే. మంచు ఫ్యామిలీ నుండి తొలి హీరోయిన్ గా పరిచయమైన ఈమె పలు సినిమాలలో నటించింది. కానీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలువలేకపోయింది. ఇక నిర్మాత కూడా బాధ్యతలు చేపట్టింది. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా బిజీగా ఉంటుంది.
ఇటీవలే ఆహాలో ఆహా భోజనంబు అనే వంటల కార్యక్రమంలో హోస్టింగ్ చేస్తుంది. ఇప్పటికే పలు ఎపిసోడ్ లను కూడా పూర్తి చేసింది. ఇక సోషల్ మీడియాలో నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా పంచుకుంటుంది. ఇక తను వర్కవుట్లు చేసే వీడియోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది. ఇటీవలే యూట్యూబ్ లో తన పేరు మీద ఓ ఛానెల్ కూడా క్రియేట్ చేసుకుంది. అందులో కూడా బాగా బిజీగా మారింది.
ఈమధ్య యూట్యూబ్ ఛానల్ లో చాలామంది సెలబ్రిటీలు మొదట తమ హోమ్ టూర్ వీడియోలనే చేస్తున్నారు. ఇక మంచు లక్ష్మి కూడా హోమ్ టూర్ వీడియో చేయగా ప్రస్తుతం అది యూట్యూబ్ లో వైరల్ గా మారింది. అంతేకాకుండా కొన్ని విషయాలు పంచుకుంది. యూఎస్ లో తన ఇల్లు కాలిపోయినప్పుడు కేవలం ఒక పెయింటింగ్ మాత్రమే ఉందని.. అదంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది.
ఇక ప్రస్తుతం ఉన్న ఈ ఇంటికి ఆరేళ్ల క్రితం వచ్చానని తెలిపింది. అభిరుచికి తగ్గట్టుగా తన ఇల్లు మార్చుకున్నా అని తెలిపింది. తన ఇంట్లో ఎక్కువగా పెయింటింగ్స్ ని ఉంచుకుంది. ఇక ప్రతి ఒక్క డిజైన్ గురించి తెలిపింది. తన ఇంట్లో ఉన్న డైనింగ్ టేబుల్ కు ఎంతో చరిత్ర ఉందని తెలిపింది. టేబుల్ పై ఎంతో మంది రాజకీయ నాయకులు, సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు భోజనం చేశారని అందుకే ఆ టేబుల్ జాగ్రత్తగా చూసుకుంటానని తెలిసింది. ఇంకా మరిన్ని విషయాలను తన వీడియోలో చూడవచ్చు.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.