తెలుగుతో పాటు తమిళ, మలయాళ ఇండస్ట్రీలలో కూడా అరుదైన ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. మోడ్రన్ మహానటి అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒకే ఒక్క సినిమాతో నేషనల్ వైడ్‌గా పాపులారిటీ సంపాదించింది కీర్తి. మహానటి ఈమె కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఈ తరం హీరోయిన్లలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో సావిత్రి పాత్రకు ప్రాణం పోసి నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకుంది ఈమె. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఎప్పుడూ కూడా హద్దులు దాటలేదు కీర్తి. గ్లామర్ షోలో కూడా తన పరిమితికి మించి ఎప్పుడూ పరిధి దాటలేదు. ఈ జనరేషన్ హీరోయిన్లలో అందం ప్లస్ అభినయం ఉన్న హీరోయిన్గా కీర్తి సురేష్‌కు మంచి పేరు వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈమె చేసిన ఓ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జూన్ 22న విజయ్ పుట్టిన రోజు సందర్భంగా దళపతికి అందరూ ఒక్కో విధంగా విష్ చేసారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విజయ్ అభిమానులంతా తమ హీరోను విష్ చేసారు.
ఇండస్ట్రీలో కూడా విజయ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. అందులో కీర్తి సురేష్ కూడా ఒకరు. విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఈమె అదిరిపోయే బహుమతి ఇచ్చింది. విజయ్ అంటే డాన్సులకు పెట్టింది పేరు. ముఖ్యంగా మాస్ డాన్సులు కుమ్మేస్తాడు.. అందుకే కీర్తి కూడా తనలోని మాస్ అభిమానిని నిద్ర లేపింది. విజయ్ కోసం తీన్మార్ స్టెప్పులు వేసింది. షర్ట్ బటన్స్ విప్పేసి రెచ్చిపోయి చిందులేసింది.
చొక్కా గుండీలు విప్పేసి చూపించి చూపించకుండా నడుము చూపిస్తూ పిచ్చెక్కించే స్టెప్పులు వేసింది కీర్తి సురేష్. ‘కేవలం నువ్వు పెర్ఫార్మన్స్ లోనే బీస్ట్ కాదు..ఎంటర్టైన్ చేయడంలో కూడా బీస్ట్’ అంటూ దలపతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈమెకు తోడుగా కీర్తి తమ్ముడు కూడా డాన్స్ చేసాడు. ఇద్దరూ మంచి కో ఆర్డినేషన్‌తో ఇరక్కొట్టేసారు. విజయ్‌తో రెండు సినిమాలు చేసింది కీర్తి. భైరవా, సర్కార్ సినిమాలలో ఈ ఇద్దరూ కలిసి నటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Keerthy Suresh, Telugu Cinema, Tollywood, Vijay