Kajal Aggarwal : 34 ప్లస్ ఏజ్‌లోనూ ఏమాత్రం వన్నె తగ్గని అందంతో అలరిస్తున్న చందమామ కాజల్ అగర్వాల్... ఎవర్ని పెళ్లి చేసుకుంటుంది? ఎప్పుడు అన్న అంశాలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.
Kajal Aggarwal Marriage : కాజల్ అగర్వాల్‌కి కాబోయే వరుడు ఎలా ఉండాలి? అతనిలో ఏయే క్వాలిటీస్ ఉండాలి... ఇలాంటి విషయాలపై చందమామ క్లారిటీ ఇచ్చింది. వయసు 35కి చేరుతున్న సమయంలో... ఆమెతో చిట్ చాట్ చేస్తున్న ప్రతీ ఒక్కరూ మీ పెళ్లెప్పుడు అని ప్రశ్నిస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఇన్నాళ్లూ... నాకు అప్పుడే పెళ్లేంటి? పెళ్లి గురించి ఆలోచించేంత టైమ్ లేదు, ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు అంటూ మాట దాటవేసింది. ఇటీవల లక్ష్మీ మంచుతో చిట్ చాట్‌లో కూడా ఇదే ప్రశ్న రావడంతో... ఇక లాభం లేదనుకున్న కాజల్ రూమర్లకు చెక్ పెట్టేసింది. పెళ్లిపై తన మనసులో మాటను బయటపెట్టింది. పెళ్లికి సంబంధించిన ప్లాన్‌ను వివరించింది.
తాను పెళ్లికి రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాజల్... వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపింది. టైమ్ కూడా చెప్పేసింది కాబట్టి... ఆల్రెడీ వరుడు ఫిక్సైపోయినట్లే. ఇన్నాళ్లూ... సరైన అబ్బాయి దొరకట్లేదని చెప్పుకొచ్చిన చందమామ... ఇప్పుడు మాత్రం తన మనసు ఆల్రెడీ ఒకరికి ఇచ్చేసినట్లు క్లారిటీ వచ్చేసింది. ఆ వరుడు ఓ బిజినెస్‌మేన్ అనే ప్రచారం జరుగుతోంది. పెద్దలే దగ్గరుండి ఈ వివాహ సంబంధాన్ని కుదిర్చినట్లు తెలిసింది. కాజల్ ప్రస్తుతం తమిళనాట కమల్ హాసన్ సరసన భారతీయుడు 2 సినిమాలో నటిస్తుంది. దాంతోపాటూ మరికొన్ని సినిమాలకు కూడా సైన్ చేసింది ఈ ముద్దుగుమ్మ. మ్యారేజ్ తర్వాత కూడా ఆమె సినిమాలు చేస్తుందనేందుకు ఇదే నిదర్శనం.
మొన్నటి వరకు వరుసగా స్టార్ హీరోలతో నటించిన ఈ భామ... ఇప్పుడు కుర్ర హీరోల చుట్టూ తిరుగుతోంది. ఇప్పటికే కాజల్ చెల్లి నిషాకు పెళ్లై... తల్లి కూడా అయిపోయింది. దాంతో తనపై ఒత్తిడి పెరగడంతో... కాజల్ కూడా పెళ్లికి ఓకే చెప్పేసినట్లు తెలిసింది. ఇంతకీ ఈ పెళ్లి సంబంధం ఎప్పుడు కుదిరింది? ఎప్పుడు ఓకే చెప్పింది అన్న ప్రశ్నలకు ఈ ఏడాది మొదట్లో అన్న సమాధానం దొరుకుతోంది. ఎందుకంటే... ఈ ఏడాది మొదట్లో... తాను ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని కాకుండా... బయటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటాననీ, సహజీవనం వంటివి చెయ్యనని చెప్పింది. అంటే అప్పటికే ఆమె మనసులో బిజినెస్‌మేన్ ఉన్నారన్నమాట. మొత్తానికి దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా పెళ్లిళ్లు అయిపోవడంతో... ఇప్పుడు కాజల్ కూడా పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైందని అనుకోవచ్చు.