జీవిత రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీకి హీరోయిన్‌గా వచ్చి దర్శకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది జీవిత. హీరోయిన్‌గా ఉన్నపుడే హీరో రాజశేఖర్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసిన జీవిత.. నటనకు దూరం అయ్యారు. టెక్నికల్ పరంగా ప్రత్యేకత చూపించారు జీవిత. ఒకానొక సమయంలో వరస సినిమాలు చేసిన ఈమె.. పెళ్లి తర్వాత పిల్లలు పుట్టగానే సినిమాలకు దూరం అయిపోయింది. ఈమె సినిమా జీవితం అందరికీ తెలుసు కానీ వ్యక్తిగత జీవితం మాత్రం ఎవరికీ పెద్దగా తెలియదు. రాజశేఖర్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు అనే సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శివానీ, శివాత్మిక. ఇప్పుడు వీళ్లు కూడా హీరోయిన్లు అయ్యారు. శివానీ సినిమాలు ఇంకా విడుదల కాలేదు కానీ శివాత్మిక మాత్రం దొరసాని సినిమాతో పరిచయం అయింది. అయితే ఇప్పుడు జీవిత గురించి తెలియని విషయాలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లి కాక ముందు ఈమె జీవితంలో జరిగిన ఓ చేదు జ్ఞాపకం గురించి అభిమానులతో పంచుకుంది జీవిత.
కాలేజ్‌కు వెళ్లే రోజుల్లో జరిగిన సంఘటన గురించి ఇప్పుడు చెప్పారు జీవిత. కాలేజ్ రోజుల్లో రోజూ బస్సులోనే వెళ్లొచ్చేది ఈమె. అప్పుడు జీవితకు పాస్ ఉండేది. ఓసారి పాస్ అయిపోయినా కూడా రెన్యువల్ చేయించుకోవడం మరిచిపోయింది. ఆ విషయం తెలిసి కూడా కండక్టర్ అడిగితే పాస్ అని చెప్పి తప్పించుకుంది. ఆ తర్వాత ఆయనొచ్చి పాస్ చూపించమని అడిగినపుడు డేట్ అయిపోయిన పాస్ చూపించింది జీవిత. దాంతో కండక్టర్ అదే విషయం చెప్పగానే బస్సులో ఉన్న వాళ్లంతా తనను చూసి నవ్వారని గుర్తు చేసుకుంది జీవిత.
కండక్టర్ టికెట్ తీసుకొమని తొందర పెడితే.. తన చేతిలో ఒక్క రూపాయి కూడా లేవని చెప్పుకొచ్చింది జీవిత. అప్పుడు బస్సులోంచి దిగి నడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్న తరుణంలో తన తండ్రి స్నేహితుడు ఒకరు బస్సులో జరిగినదంతా చూసి టికెట్ తీసుకొని తనను రక్షించారని చెప్పింది జీవిత. ఆ అనుభవం తర్వాత ఎక్కడికి వెళ్లినా కూడా చేతిలో డబ్బులు తీసుకెళ్లడం అలవాటుగా మార్చుకుంది ఈమె.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.