హోమ్ /వార్తలు /సినిమా /

Jeevitha Rajasekhar: జీవితా రాజశేఖర్‌కు షాక్.. సగం ధరకే అంటూ కుచ్చటోపి..!

Jeevitha Rajasekhar: జీవితా రాజశేఖర్‌కు షాక్.. సగం ధరకే అంటూ కుచ్చటోపి..!

జీవిత రాజశేఖర్’కు కుచ్చుటోపి

జీవిత రాజశేఖర్’కు కుచ్చుటోపి

. తన ప్రమోషన్‌ కోసం సహకరించాలని జీవితను నమ్మించాడు. పాపం అతడు అంతలా రిక్వెస్ట్ చేయడంతో... సరేనంటూ... జీవిత తన మేనేజర్‌కు  ఈ సంగతేంటో చూడాలంటూ... కోరారు. 

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టాలీవుడ్  సెలబ్రిటీ కపుల్‌లో జీవితా, రాజశేఖర్ ఒకరు. ఈ జంట ఎప్పుడు వార్తల్లోనే ఉంటుంది.వీరిద్దరి కూతుళ్లు కూడా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడంతో వీరు మరింత బిజీగా మారిపోయారు. అయితే తాజాగా   ప్రముఖ నటి జీవితా రాజశేఖర్ మరోసారి వార్తల్లో హాట్ టాపిక్‌గా మారారు. జీవితా రాజశేఖర్ కు ఓ సైబర్ నేరగాడు చేతిలో మోసపోయారు. అతడు మాటలను నమ్మి  లక్ష రూపాయలకు పైగా నగదును జీవితా మేనేజర్ ట్రాన్స్ ఫర్ చేశారు. అసలు విషయానికి వస్తే.. జీవిత ఇటీవల ఇంట్లో జియో వైఫై కనెక్షన్‌ తీసుకున్నారు. అయితే కనెక్షన్ తీసుకున్న కొద్దిరోజులకు జీవితకు ఒక కాల్‌ వచ్చింది.

మీ ఇంట్లో వైఫై ఇన్‌స్టాల్‌ చేసింది నేను అంటూ ఓ అజ్ఞాత వ్యక్తి  కాల్ చేశాడు. తనకు ప్రమోషన్‌ వచ్చి.. ఇప్పుడు జియో వస్తువుల అమ్మకాలు జరుపుతున్నానని.. చెప్పాడు. అవి అమ్మితే తనకు మరో ప్రమోషన్‌ వస్తుందని తెలిపాడు. సగం ధరకే జియో బహుమతులు అందజేస్తానని.. తన ప్రమోషన్‌ కోసం సహకరించాలని జీవితను నమ్మించాడు. పాపం అతడు అంతలా రిక్వెస్ట్ చేయడంతో... సరేనంటూ... జీవిత తన మేనేజర్‌కు  ఈ సంగతేంటో చూడాలంటూ... కోరారు.

దీంతో జీవిత మేనేజర్‌ ఆ సైబర్ నేరగాడికి  కాల్ చేసి మాట్లాడాడు. సగం ధరకే జియో బహుమతులు అందిస్తానని తెలిసిన వారి పేర్లను చెప్పి నమ్మించడంతో మేనేజర్‌ కూడా అతడి బుట్టలో ఈజీగా పడిపోయాడు.ఇక ఆ తర్వాత సైబర్‌ నేరగాడు ఇచ్చిన జాబితాలో నుంచి పలు వస్తువులను ఎంచుకున్నాడు. అయితే వీటికి సంబంధించిన టోకెన్‌ అమౌంట్‌ పంపించాలని మేనేజర్‌ని అడిగాడు. దీంతో మేనేజర్‌ వెంటనే లక్షన్నర రూపాయలు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. అయితే డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ కాగానే.. ఆ సైబర్‌ నేరగాడు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు.

దీంతో మోసపోయానని గ్రహించిన మేనేజర్‌.. జీవితకు అసలు విషయం చెప్పాడు. ఇక చేసేది ఏం లేక... జీవితా రాజశేఖర్ పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్‌ సీసీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు  సైబర్‌ నేరగాడి సెల్‌ఫోన్‌ డేటా ఆధారంగా నిందితుడు చెన్నైకి చెందిన నరేశ్‌గా గుర్తించారు. వెంటనే అతడ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే నరేశ్‌ ఇప్పటికే పలువురు సినీనటులు, ప్రొడ్యూసర్లకు ఇలాగే కుచ్చుటోపి పెట్టినట్లు పోలీసులు తేల్చారు. గతంలో  కూడా ఈ విధమైన మోసాలకు నరేష్ పాల్పడినట్లు విచారణలో గుర్తించారు.

First published:

Tags: Jeevitha, Jeevitha rajashekar

ఉత్తమ కథలు