TOLLYWOOD ACTRESS INDRAJA SHOCKING COMMENTS ABOUT HEROINE SOUNDARYA GOES VIRAL ON INTERNET NR
Soundarya - Indraja: సౌందర్య గారు అలాంటి సలహాలు ఇచ్చేవారు అంటున్న నటి ఇంద్రజ
indraja soundarya
Soundarya - Indraja: నటి ఇంద్రజ.. ఒకప్పుడు వెండితెరపై తన ట్యాలెంట్ తో.. నటనతో ఎంతోమందిని మెప్పించిన నటి. ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది నటి ఇంద్రజ.
Soundarya - Indraja: నటి ఇంద్రజ.. ఒకప్పుడు వెండితెరపై తన ట్యాలెంట్ తో.. నటనతో ఎంతోమందిని మెప్పించిన నటి. ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది నటి ఇంద్రజ. అలాంటి నటి ఇంద్రజ ఇప్పుడు బుల్లితెరపై కూడా ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ లో ఎమ్మెల్యే రోజా స్థానంలో నటి ఇంద్రజ వచ్చి నవ్వులు పంచుతున్నారు. అలాంటి ఇంద్రజ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌందర్య గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
గతంలో ఆమని, సౌందర్య వంటి స్టార్ హీరోయిన్లతో కలిసి పని చేశారు నటి ఇంద్రజ. అలాంటి ఇంద్రజ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ కామెంట్లు చేసారు. నటి ఇంద్రజ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమయంలో నటి సౌందర్య టాప్ హీరోయిన్ స్థానంలో ఉన్నారని.. అయినప్పటికీ ఆమె ఎప్పుడు పెద్ద హీరోయిన్ అని గర్వం చూపించలేదని.. సెట్స్ లో అందరితో ఎంతో సరదాగా మాట్లాడుతూ.. స్కిన్ ను ఎలా కాపాడుకోవాలి అనే విషయంపై ఆమె సలహాలు, సూచనలు ఇచ్చేవారని చెప్పుకొచ్చారు.
ఆమె నిజంగా ఎంతో మంచి వ్యక్తి అని.. ఆమె జీవితంలో ఎప్పటికి నమ్మలేని నిజం ఏదైనా ఉంది అంటే అది సౌందర్య మరణం అని.. అది కల అయితే బాగుండు అని ఆమెకు చాలాసార్లు అనిపించినట్టు చెప్పుకొచ్చారు ఇంద్రజ. కాగా నటి సౌందర్య 2004లో హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించి ఆమె అభిమానులను శోక సంద్రంలో వదిలి వెళ్లిపోయారు. ఆమె మరణించి ఇన్నేళ్లు అయినా ఆమెను మర్చిపోలేకపోతున్నారు తెలుగు ప్రేక్షకులు.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.