హోమ్ /వార్తలు /సినిమా /

Maa Elections: రేసు నుంచి హేమ, జీవితలు ఔట్.. ప్రకాష్ రాజ్ ప్యానల్‌లో ఇద్దరు?

Maa Elections: రేసు నుంచి హేమ, జీవితలు ఔట్.. ప్రకాష్ రాజ్ ప్యానల్‌లో ఇద్దరు?

Maa Elections

Maa Elections

Maa Elections: తెలుగు సినీ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవలే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేయడానికి పలువురు నటీనటులు ముందుకు రాగా అందులో సినీ నటి హేమ, జీవిత రాజశేఖర్ లు కూడా ఉన్నారు.

ఇంకా చదవండి ...

  Maa Elections: తెలుగు సినీ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవలే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేయడానికి పలువురు నటీనటులు ముందుకు రాగా అందులో సినీ నటి హేమ, జీవిత రాజశేఖర్ లు కూడా ఉన్నారు. ఇక వీరు కూడా మొదట్లో పోటీ చేయడానికి ముందుకు రాగా తాజాగా ప్రకాష్ రాజ్ కు మద్దతు పలకడానికి ముందుకు వచ్చారు.

  ఈ విషయం గురించి ప్రకాష్ రాజ్ మీడియా ద్వారా కొన్ని విషయాలు పంచుకున్నాడు. తామందరు సిని 'మా' బిడ్డలం అంటూ మాట్లాడగా.. ఇండస్ట్రీకి సేవ చేయాలని వచ్చాను అని తెలిపాడు. తనకు తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో చేయాలని ఉందని.. అవకాశం ఇస్తే మాత్రం అదేంటో నిరూపిస్తాను అని తెలిపాడు. ఇక గతంలో తాను కొందరు సభ్యులతో ముందుకు రాగా వాళ్లంతా తన శ్రేయోభిలాషులని తెలిపాడు.

  ఇది కూడా చదవండి:ప్రకాశ్ రాజ్‌కు గాయాలు.. సర్జరీ కోసం హైదరాబాద్‌కు విలక్షణ నటుడు..

  ఇక ఇప్పుడు తను 'మా' ప్యానల్ ను ప్రకటిస్తున్నాను అని అందులో మహిళలకు కూడా సమాన అవకాశాలు ఇస్తున్నానని తెలిపాడు. ఇక జీవిత, హేమ లు కూడా ముందుగా ఈ ఎన్నికల్లో పాల్గొనడానికి వచ్చారని కానీ ఈ విషయం గురించి వాళ్లతో చర్చలు చేశానని తెలిపాడు. హేమ తో.. మనం అందరం కలిసి ఉండాలి మీరు ఏమంటారు అని ప్రశ్నించగా వెంటనే తను కూడా తన ఆలోచనలు నచ్చాయని.. ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిందట.

  ఇది కూడా చదవండి:మా అసోసియేషన్ ఎన్నికల తేదీ ఖరారు.. అధ్యక్ష బరిలో ఉన్న ఆరుగురు..!

  అంతేకాకుండా జీవిత రాజశేఖర్ తో కూడా రెండు గంటలపాటు మాట్లాడగా తను కూడా తన ప్యానల్ లో పోటీ చేయడానికి సిద్ధమే అని మద్దతు ఇచ్చారని తెలిపాడు ప్రకాష్ రాజ్. ఇక గతంలో సాయి కుమార్, బండ్ల గణేష్ తనతో చెప్పిన విషయాలు పంచుకున్నాడు. పైగా వారితో పాటు పలువురు సభ్యులు కూడా తనకు తోడుగా ఉంటామని అన్నారట. త్వరలోనే విలేకర్ల సమావేశంలో అందరితో కలిసి సమావేశం ఏర్పాటు చేస్తానని.. అప్పుడే అన్ని విషయాల గురించి వివరిస్తానని తెలిపాడు ప్రకాష్ రాజ్.

  Published by:Navya Reddy
  First published:

  Tags: Hema, Jeevitha, MAA Elections, Prakash Raj, Tollywood

  ఉత్తమ కథలు