TOLLYWOOD ACTRESS BACK DOOR MOVIE REVIEW AND RATING PK
Back Door movie review: పూర్ణ ‘బ్యాక్ డోర్’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
పూర్ణ బ్యాక్ డోర్ సినిమా రివ్యూ (back door movie)
Back Door movie review: తేజ త్రిపురాన హీరోగా నటించిన తాజా చిత్రం బ్యాక్ డోర్. ఇందులో హీరోయిన్ పూర్ణ ప్రధాన పాత్రలో నటించింది. సినిమాకు కర్రీ బాలాజీ దర్శకత్వం వహించారు. ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై బి శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా తాజాగా విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించిందో, సినిమాలో అసలు కథ ఏమిటి.. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
8నటీనటులు : పూర్ణ, తేజ త్రిపురాన తదితరులు
నిర్మాణ సంస్థ : ఆర్చిడ్ ఫిలిమ్స్
నిర్మాత : బి.శ్రీనివాస్ రెడ్డి
దర్శకత్వం : కర్రి బాలాజీ
సంగీతం : ప్రణవ్
ఎడిటర్ : చోటా కె. ప్రసాద్
సినిమాటోగ్రఫీ : శ్రీకాంత్ నారోజ్
తేజ త్రిపురాన హీరోగా నటించిన తాజా చిత్రం బ్యాక్ డోర్. ఇందులో హీరోయిన్ పూర్ణ ప్రధాన పాత్రలో నటించింది. సినిమాకు కర్రీ బాలాజీ దర్శకత్వం వహించారు. ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై బి శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా తాజాగా విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించిందో, సినిమాలో అసలు కథ ఏమిటి.. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కథ:
అంజలి( పూర్ణ ) ఓ గృహిణి. ఆమె భర్త ఒక వ్యాపారవేత్త. ఆమెకు తన భర్త ఇల్లు, అదే లోకం. ఒకసారి ఆమెకు ఒక వివాహ వేడుకలో అరుణ్(తేజ త్రిపురాణ) పరిచయం అవుతాడు. ఆ తర్వాత అంజలితో మాటలు కలిపి ఆమెను బుట్టలో పడేస్తాడు. ఇందులో అంజలి అందానికి అరుణ్ ఫిదా అవుతాడు. అలా వాళ్లిద్దరూ ఆ తర్వాత ఫోన్లో మాట్లాడుకోవడం మొదలు పెడతారు. ఇక భర్త ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత, పిల్లల్ని స్కూల్‌కి పంపి ఆ తర్వాత అరుణ్‌ని ఇంటికి రప్పించుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అంజలి అరుణ్ మాయలో పడిందా? అన్నది అసలు కథ.
కథనం, నటీనటులు:
ఇందులో పూర్ణ నటన మెప్పిస్తుంది. సినిమాలో ఆమె పాత్ర నటిస్తూనే మనసులో స్త్రీ తత్వాన్ని ప్రదర్శించింది. ఇందులో ఆమె క్యారెక్టర్లో ప్రతి ఒక ఎమోషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. అలాగే తేజ కూడా సినిమాల్లో బాగానే నటించాడు. ఈ సినిమా ట్రైలర్లో చెప్పిన డైలాగ్ మొత్తం కథను అర్థం చేసుకోవచ్చు. సినిమా చివరిలో మంచి సందేశాన్ని ఇచ్చారు దర్శకుడు. ఈ సినిమాను ఫ్యామిలీతో సైతం చూడవచ్చు. అలాగే ఇక ఇందులో టెక్నికల్ అంశాలు, సినిమాటోగ్రఫీ,సంగీతం బలంగానే ఉన్నాయి. ఇందులో పాటలు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.
రేటింగ్: 2.5/5
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.