TOLLYWOOD ACTRESS ANUSHKA SHETTY SHARED HER CASTING COUCH EXPERIENCE IN INDUSTRY PK
Anushka Shetty: అనుష్క శెట్టి కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలే.. ఎప్పుడో తెలుసా..?
అనుష్క శెట్టి (anushka shetty)
Anushka Shetty: తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు 'మీటూ' గురించి మాత్రమే కాదు.. 'కాస్టింగ్ కౌచ్' గురించి చాలా చర్చ జరుగుతుంది. ఎంతోమంది అమ్మాయిలు బయటికి వచ్చి తమకు జరిగిన..
తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు 'మీటూ' గురించి మాత్రమే కాదు.. 'కాస్టింగ్ కౌచ్' గురించి చాలా చర్చ జరుగుతుంది. ఎంతోమంది అమ్మాయిలు బయటికి వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకుంటున్నారు. అందులో కొందరు స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారు. అయితే దీనిపై ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క కూడా స్పందించింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదని మాత్రం తను చెప్పడం లేదని క్లారిటీ ఇచ్చింది ఈమె. అంటే ఉందని ఒప్పుకున్నట్లే కదా అంటున్నారు ఫ్యాన్స్. అయితే గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి సినిమాను టార్గెట్ చేస్తారు. కానీ ప్రతీ రంగంలోనూ ఆడవాళ్ళకి వేధింపులు తప్పడం లేదని అభిప్రాయ పడింది అనుష్క. అంతే కాకుండా మన టాలీవుడ్లో ఇది లేదని చెప్పడం లేదు కానీ.. తాను కూడా కెరీర్ కొత్తలో కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డట్లు సంచలన వ్యాఖ్యలు చేసింది అనుష్క. అయితే తనతో ఎవరూ అంతగా మిస్ బిహేవ్ చేయలేదని చెప్పింది ఈమె. తాను ముక్కుసూటిగా ఉండటమే కాదు ప్రతీ విషయంలోనూ నిజాయతీగా ఉంటానని.. అందులో తన వరకు కూడా ఎప్పుడూ ఇలాంటి మీటూ, క్యాస్టింగ్ కౌచ్ కానీ తనను ఇబ్బంది పెట్టలేదని చెప్పుకొచ్చింది. తాను ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండేందుకు కష్టమైన మార్గాన్నే ఎంచుకున్నానని చెప్పింది జేజమ్మ.
అనుష్క శెట్టి (Anushka Shetty/ Twitter)
ఓ అమ్మాయి నుంచి ఆమెకు ఇష్టం లేకుండా వేరే రకమైన విషయాలను అడగడం కూడా తప్పే అంటుంది అనుష్క. అది పూర్తిగా ఆమె వ్యక్తిగత విషయమని స్పష్టం చేసింది జేజమ్మ. అలాగే అమ్మాయిలు ఎక్కడైనా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలంటే ఈజీ వేతో పాటు కష్టమైన దారి కూడా ఉంటుందని.. తాను కఠినమైన దారిలోనే వచ్చానని చెప్పింది ఈమె.
అనుష్క శెట్టి ఫైల్ ఫోటో (Anushka Shetty/Instagram)
అసలు ఇలాంటి వాటికి 'నో' అని చెప్పడం నేర్చుకుంటేనే పురుషులు స్త్రీలను గౌరవించడం ప్రారంభిస్తారని చెప్పింది అనుష్క. గతేడాది ఈమె నటించిన నిశ్శబ్ధం సినిమా భారీ డిజాస్టర్ అయింది. ప్రస్తుతం గ్యాప్ తీసుకుని కొత్త కథల కోసం చూస్తుంది స్వీటీ.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.