• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • TOLLYWOOD ACTRESS ANUSHKA SHETTY MOTHER SHOCKING COMMENTS ON BILLA MOVIE BIKINI SCENE NR

Anushka Shetty: అనుష్క బికినీపై తల్లి షాకింగ్ కామెంట్స్.. అలా ఉండొచ్చు కదా అంటూ?

Anushka Shetty: అనుష్క బికినీపై తల్లి షాకింగ్ కామెంట్స్.. అలా ఉండొచ్చు కదా అంటూ?

Anushka shetty

 Anushka Shetty: టాలీవుడ్ సినీ నటి బెంగళూరు బ్యూటీ అనుష్క శెట్టి పరిచయం గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈమె నటన గురించి మాట‌లో చెప్పలేనిది.

  • Share this:
    Anushka Shetty: టాలీవుడ్ సినీ నటి బెంగళూరు బ్యూటీ అనుష్క శెట్టి పరిచయం గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈమె నటన గురించి మాట‌లో చెప్పలేనిది. ఎన్నో సినిమాలలో నటించిన అనుష్క తన నటనకు మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా నిలిచింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించింది.

    హీరో నాగార్జున నటించిన సూపర్ సినిమా ద్వారా తొలిసారిగా సినీ పరిశ్రమకు పరిచయం అయ్యింది. ఇక ఆ తర్వాత వరుస సినిమాలతో వెనుతిరుగకుండా దూసుకుపోయింది. తమిళంలో కూడా నటించిన ఈ ముద్దుగుమ్మ.. పాన్ ఇండియా సినిమాలలో కూడా నటించింది. ఇక బాహుబలి తర్వాత ఈమె క్రేజ్ మరింత పెరిగింది. కానీ ప్రస్తుతం సినిమాలకు దూరంగాఉంది. ఇటీవల నిశ్శబ్దం సినిమాలో నటించగా ఈ సినిమా అంత సక్సెస్ అందుకోలేదు. ఇక తన అమ్మ బిల్లా సినిమా చూసి చెప్పిన మాటకు షాక్ అయిందట..

    ఇదిలా ఉంటే అనుష్క సినిమాల్లో కాకుండా బయట తన నిజజీవితంలో పద్ధతిగల దుస్తులను ధరిస్తుంది. అంతేకాకుండా తెలుగు సినీ పరిశ్రమలో అనుష్క దుస్తుల స్టైల్ మరే హీరోయిన్ కు లేదని టాక్ కూడా వచ్చింది. ఇక ఈ బ్యూటీ సినిమాల్లోకి రాకముందు సల్వార్ కమీజ్ లోని ధరించేది. కానీ సినిమాల్లోకి అడుగు పెట్టాక పాత్రకు తగ్గట్టు దుస్తులను ధరించాల్సి వచ్చింది. అనుష్కకు వ్యక్తిగతంగా బికినీ వంటి డ్రెస్సులు ఇష్టం ఉండవు. కానీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ఆమె నటించిన బిల్లా సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఈమె ఎంతో హాట్ గా కనిపించగా.. పాత్ర డిమాండ్ బట్టి బికినీ ధరించింది. ఇందులో తను వేసుకున్న డ్రస్సుల గురించి వాళ్ళ అమ్మ బిల్లా సినిమా చూసినప్పుడు ఇంకా స్టైలిష్ గా ఉండొచ్చు కదా.. సగం పద్ధతిగా, సగం మోడ్రన్ గా ఆ డ్రస్సులేంటి అని అన్నదట. దీంతో ఆ మాటకు అనుష్క షాక్ అయిందట. ఈ విషయాన్ని అనుష్క ఓ సందర్భంలో పంచుకుంది.
    Published by:Navya Reddy
    First published: