ముద్దులతో ముంచెత్తుతున్న రష్మి గౌతమ్.. హార్ట్ బీట్ పెంచుతున్న జబర్దస్త్ బ్యూటీ..

Instagram Video: వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ‘సెల్ఫ్ లవ్.. మంచి లవ్’ అని కామెంట్ పెట్టింది. అంతేకాదు.. మరో వీడియోలో చేతి వేళ్లను తుపాకిలా మార్చి డిష్యుం.. డిష్యుం.. అంటోంది.

news18-telugu
Updated: June 6, 2019, 2:46 PM IST
ముద్దులతో ముంచెత్తుతున్న రష్మి గౌతమ్.. హార్ట్ బీట్ పెంచుతున్న జబర్దస్త్ బ్యూటీ..
రష్మి గౌతమ్
  • Share this:
జబర్దస్త్ యాంకర్, హాట్ భామ రష్మి గౌతమ్ తన మాటలతోనే కాదు.. తన చూపుతో, వయ్యారంతో యువకుల గుండె కొట్టుకునే రేటును అమాంతం పెంచేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనదైన శైలిని ప్రదర్శిస్తుంది. తాజాగా, అద్దం ముందు తన బింబాన్ని చూసుకుంటూ తానే ముద్దులిచ్చుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ‘సెల్ఫ్ లవ్.. మంచి లవ్’ అని కామెంట్ పెట్టింది. అంతేకాదు.. మరో వీడియోలో చేతి వేళ్లను తుపాకిలా మార్చి డిష్యుం.. డిష్యుం.. అంటోంది. ఈ రెండు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ వీడియోలు చూసిన చాలా మంది పిచ్చి పీక్స్‌కు వెళ్లిందంటూ, నిన్ను తట్టుకోవడం చాలా కష్టం అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

View this post on Instagram
 

Self love 💖 is the best love 💖 #lifeismagical #blowkisses #rashmigautam


A post shared by Rashmi Gautam (@rashmigautam) on
 
View this post on Instagram
 

On this note #goodnight #lifeismagical #rashmigautam #blowkisses #fireguns #leanon


A post shared by Rashmi Gautam (@rashmigautam) on


కాగా, రష్మి తన ట్విటర్‌లో సినిమాలకు సంబందించిన వార్తల కన్నా సమాజం గురించి, చుట్టూ జరుగుతున్న ప్రస్తుత విషయాల గురించి మాట్లాడుతూ ఉంటుంది. అయితే వాటిల్లో కూడా ఆమె ముఖ్యంగా మహిళ సాధికారత మొదలగు విషయాల పట్ల ఎక్కువగా స్పందిస్తూ తన ట్వీటర్ హ్యాండిల్‌‌ను వేదికగా చేసుకొని రాస్తూ ఉంటుంది రష్మీ. మధ్య మధ్యలో తన మీద తానే జోక్స్ వేసుకుంటుంది కూడా. తన డ్రెస్సింగ్ స్టైల్‌ను జెలిసిల్ బాటిల్‌తో పోల్చుకొని ఆ ఫోటోను వైరల్ చేసుకుంది కూడా. ఢీ ప్రోగ్రాం కోసం ఆమెకు ఫుల్ రోజ్ కలర్ సూట్‌ వేసుకోవాల్సి వచ్చింది. గులాబీ రంగు ప్యాంట్, గులాబీ రంగు కోట్, ఫ్లవర్స్ టీ షర్ట్‌ కాంబినేషన్‌లో రష్మి గౌతమ్ లుక్ అదిరిపోయింది. అయితే, ఆ గెటప్‌లో తనను తాను మొదటిసారి అద్దం ముందు చూసుకుంటే జెలిసిల్ ఎంటాసిడ్ బాటిల్ గుర్తొచ్చిందట. ఈ విషయాన్ని చెప్పడం కాదు. ఏకంగా తన ఫొటో, పక్కన మెడిసిన్ బాటిల్ ఫొటోకూడా కలిపి ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
First published: June 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు