TOLLYWOOD ACTORS BANDLA GANESH SRIKANTH GETS SERIOUS OVER NARESH VIDEO BYTE ABOUT SAI DHARAM TEJ ACCIDENT PK
Bandla Ganesh serious on Naresh: ఎప్పుడేం మాట్లాడాలో నేర్చుకోండి సార్.. నటుడు నరేష్‌పై మండిపడ్డ బండ్ల గణేష్..
బండ్ల గణేష్ నరేష్ (Bandla Ganesh Naresh)
Bandla Ganesh serious on Naresh: మెగా మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) యాక్సిడెంట్‌పై సీనియర్ నటుడు నరేష్ (Bandla Ganesh serious on Naresh) స్పందించిన తీరు పలువురు సినీ ప్రముఖులకు కోపం తెప్పించింది. శ్రీకాంత్ సహా మరికొందరు స్టార్స్ కూడా నరేష్ తీరును తప్పుబట్టారు.
మెగా మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్‌పై సీనియర్ నటుడు నరేష్ స్పందించిన తీరు పలువురు సినీ ప్రముఖులకు కోపం తెప్పించింది. శ్రీకాంత్ సహా మరికొందరు స్టార్స్ కూడా నరేష్ తీరును తప్పుబట్టారు. ఏ సమయంలో ఏం మాట్లాడాలో తెలియకపోతే ఎలా అంటూ సీరియస్ అయ్యారు. చనిపోయిన వాళ్ల పేర్లు తీసి.. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ గురించి మాట్లాడితే అనవసరంగా లేనిపోని కంగారు పుట్టించినట్లు అవుతుందని.. సాయి చాలా బాగున్నాడని వాళ్లు చెప్తున్నారు. ఈ విషయంలో నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఓ వీడియో పోస్ట్ చేసాడు. అందులో నరేష్ తీరును తప్పు పట్టడమే కాకుండా.. ఎప్పుడేం మాట్లాడాలో నేర్చుకోండి సార్ అంటూ సీరియస్ అయ్యాడు. తాజాగా బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ఇది వైరల్ అవుతుంది.
అందులో ఆయన మాటలు యాధతథంగా.. ‘సాయి ధరమ్ తేజ్‌గారు షూటింగ్స్ చేస్తారు.. బ్రహ్మాండంగా ఉంటారు.. అద్భుతంగా ఉంటుంది. చిన్న ప్రమాదం జరిగింది. ఈ టైమ్‌లో నరేష్ గారు.. మీరు ఎవరెవరో ప్రమాదవశాత్తూ మరణించిన వారి పేర్లు చెప్పడం కానీ, మీరట్లా మాట్లాడటం కానీ కరెక్ట్ కాదు. ఇప్పుడెందుకు సార్. రేసింగ్ చేశాడు.. అది చేశాడు, ఇది చేశాడు. మీ ఇంటి దగ్గరకు వచ్చాడు.. ఎందుకు ఇవన్నీ చెప్పండి. తప్పు కదా సార్. ఇట్లాంటప్పుడు ఆ పరమేశ్వరుని ప్రార్థించి త్వరగా కోలుకోవాలి.. సాయి ధరమ్ తేజ్ మనలో హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి గానీ, ఇట్లాంటవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఇది కరెక్ట్ కాదు. ఎప్పుడేం మాట్లాడాలో నేర్చుకోండి సార్. మీ అందరికీ చేతులెత్తి దణ్ణం పెడుతున్నాను. సాయిధరమ్ తేజ్, భగవంతుడి ఆశీస్సులతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. బ్రహ్మాండంగా ఉంటుంది.. థ్యాంక్యూ’ అని బండ్ల గణేష్ పేర్కొన్నారు.
It’s True .please don’t do politics In this time it’s not correct it’s my humble request🙏 pic.twitter.com/ckFXWwKEE7
మరోవైపు సీనియర్ హీరో శ్రీకాంత్ సైతం ఇదే చెప్పాడు. అపోలో హాస్పిటల్‌కు ప్రకాశ్ రాజ్‌తో కలిసి వచ్చి సాయి ధరమ్ తేజ్‌ను పరామర్శించి వెళ్లాడు ఈయన. సాయికి జరిగింది చాలా చిన్న ప్రమాదం అని.. స్కిడ్ అయి పడిపోయాడని.. అతడికేం కాలేదని చెప్పుకొచ్చాడు శ్రీకాంత్. ఇటువంటి సమయంలో మన పెట్టే వీడియో బైట్స్.. మాట్లాడే మాటలు ఆ కుటుంబానికి మరింత టెన్షన్ పెట్టేలా ఉంటాయని గుర్తు చేసాడు శ్రీకాంత్. నరేష్ పెట్టిన బైట్ తనకు నచ్చలేదని చెప్పాడు శ్రీకాంత్.
అది కాకుండా చనిపోయిన వాళ్ల గురించి ఎత్తకుండా ఉంటే బాగుండేదని అనిపించినట్లు చెప్పాడు శ్రీకాంత్. అందుకని దయచేసి ఇటువంటి వీడియోలు ఎవ్వరూ పెట్టొద్దంటూ మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పాడు శ్రీకాంత్. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడుని కోరుకుంటున్నాని శ్రీకాంత్ తెలిపాడు. బండ్ల గణేష్, శ్రీకాంత్ మాత్రమే కాదు.. మరికొందరు సినీ ప్రముఖులు సైతం నరేష్ వీడియో బైట్స్పై మండి పడుతున్నారు. ఏ సమయంలో ఏం మాట్లాడాలో తెలియకపోతే.. ఎంత వయసొచ్చినా ఏం లాభమంటూ ఫైర్ అవుతున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.