ఫలక్నుమా దాస్, హిట్ లాంటి కమర్షియల్ విజయాలతో దూసుకుపోతున్న హీరో విశ్వక్ సేన్. ఈ రెండు సినిమాల కంటే ముందు వచ్చిన ఈ నగరానికి ఏమైంది కూడా పర్లేదనిపించింది. కలెక్షన్స్ పరంగా ఇది కూడా సేఫ్ అయింది. దాంతో హీరోగా మూడు విజయాలు అందుకున్నాడు విశ్వక్. ఇలాంటి సమయంలో బడా నిర్మాత దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ నిర్మించిన సినిమా ‘పాగల్’. దీనిపై ముందు నుంచి మంచి అంచనాలున్నాయి. సెకండ్ వేవ్ తర్వాత పాగల్ సినిమాను భారీగా విడుదల చేసారు. ఆగస్ట్ 15 కానుకగా ఒక్క రోజు ముందు విడుదల చేసారు ఈ సినిమాను. ఈ సినిమాను నరేష్ కుప్పిలి తెరకెక్కించాడు. ఆగస్ట్ 14న విడుదలైన ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది.. అయినా కూడా తొలిరోజు కలెక్షన్స్ బాగానే వచ్చాయి. రెండో రోజు మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది ఈ సినిమా. శనివారం విడుదలైన ఈ చిత్రానికి రెండు రోజుల్లో దాదాపు రూ 2.65 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.
నైజాం: 1.02 కోట్లు
సీడెడ్: 0.38 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.44 కోట్లు
ఈస్ట్: 0.13 కోట్లు
వెస్ట్: 0.09 కోట్లు
గుంటూరు: 0.17 కోట్లు
కృష్ణా: 0.11 కోట్లు
నెల్లూరు: 0.07 కోట్లు
ఏపీ + తెలంగాణ: 2.41 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.23 కోట్లు
వరల్డ్ వైడ్: 2.64 కోట్లు
విశ్వక్ సేన్ మార్కెట్ బాగానే ఉండటంతో పాగల్ సినిమాను రూ.6.3 కోట్లకు అమ్మారు. ఈ చిత్రం హిట్ కావాలంటే రూ.6.5 కోట్ల వరకు షేర్ వసూలు చేయాలి. ఇప్పటి వరకు వచ్చింది రూ.2.64 కోట్ల షేర్ మాత్రమే. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో రూ.3.9 కోట్ల వరకు షేర్ రాబట్టాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Paagal film, Telugu Cinema, Tollywood, Vishwak Sen