• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • TOLLYWOOD ACTOR VARUN SANDESH NEW MOVIE INDUVADANA FIRST LOOK POSTER LAUNCHED PK

Varun Sandesh: చాలా ఏళ్ళ తర్వాత వరుణ్ సందేశ్ రీ ఎంట్రీ.. ‘ఇందువదన’కు మంచి రెస్పాన్స్..

Varun Sandesh: చాలా ఏళ్ళ తర్వాత వరుణ్ సందేశ్ రీ ఎంట్రీ.. ‘ఇందువదన’కు మంచి రెస్పాన్స్..

ఇందువదన సినిమా పోస్టర్ (Induvadana movie poster)

Varun Sandesh: హ్యాపీ డేస్ సినిమాతో పరిచయమై.. వెంటనే కొత్త బంగారు లోకం సినిమాతో మరో బ్లాక్‌బస్టర్ అందుకుని క్రేజీ హీరోగా మారిపోయారు వరుణ్ సందేశ్. తాజాగా ఈయన ఇందువదన సినిమాతో వస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది.

  • Share this:
హ్యాపీ డేస్ సినిమాతో పరిచయమై.. వెంటనే కొత్త బంగారు లోకం సినిమాతో మరో బ్లాక్‌బస్టర్ అందుకుని క్రేజీ హీరోగా మారిపోయారు వరుణ్ సందేశ్. కానీ ఆ తర్వాత వరస పరాజయాలు పలకరించడంతో కెరీర్ ఒక్కసారిగా డైలమాలో పడిపోయింది. డజన్ సినిమాలకు పైగా చేసినా కూడా ఈయన కెరీర్ పెద్దగా గాడిన పడలేదు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్ 3 పుణ్యమా అని మరోసారి వరుణ్ సందేశ్ పాపులర్ అయ్యారు. తాజాగా ఈయన ఇందువదన సినిమాతో వస్తున్నారు. శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై నైనిష్య & సాత్విక్ స‌మ‌ర్ప‌ణ‌లో MSR దర్శకత్వం వ‌హిస్తున్న‌, శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రం ఇందువదన. వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ఇందులో జంటగా నటిస్తున్నారు. చాలా ఏళ్ళ తర్వాత ఇందువదన సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ సందేశ్. తాజాగా విడుదలైన ఇందువదన ఫస్ట్ లుక్‌ చాలా కళాత్మకంగా ఉండటంతో అనూహ్యమైన స్పందన వస్తుంది. అందులో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్ కథాపరంగా చాలా అద్భుతంగా డిజైన్ చేసారు దర్శకుడు MSR.

విడుదలైన క్షణం నుంచే ఇందువదన లుక్‌కు మంచి స్పందన వస్తున్నందుకు చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉండటమే కాకుండా,వరుణ్ సందేశ్ కూడా ఇందువదన సినిమా కోసం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా.. శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు.

varun sandesh,varun sandesh twitter,varun sandesh movies,varun sandesh induvadana movie,varun sandesh induvadana movie poster,telugu cinema,వరుణ్ సందేశ్,వరుణ్ సందేశ్ ఇందువదన ఫస్ట్ లుక్
ఇందువదన సినిమా పోస్టర్ (Induvadana movie poster)


సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేయనున్నారు. మరి ఈ సినిమాతో వరుణ్ ఎలాంటి మాయ చేయబోతున్నారో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published: