Appudu Ippudu movie review: ‘అప్పుడు ఇప్పుడు’ రివ్యూ.. కథ బాగున్నా కన్ఫ్యూజన్ ఎక్కువైంది..

అప్పుడు ఇప్పుడు సినిమా రివ్యూ (Appudu Ippudu movie review)

Appudu Ippudu movie review: తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికీ ఎక్స్‌పైర్ అవ్వని జోనర్ ప్రేమకథా చిత్రాలు. ఎప్పటికప్పుడు కొత్తగా ప్రేమకథలు చేస్తూనే ఉంటారు దర్శకులు. కాస్త కొత్తదనం ఉన్నా ప్రేక్షకులు కూడా వీటి వైపు అడుగులు వేస్తుంటారు.. ఆదరిస్తుంటారు. తాజాగా మరో ప్రేమకథ కూడా అలాగే వచ్చింది. థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత చాలా చిన్న సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి. ఈ వారం అలా వచ్చిన సినిమా ‘అప్పుడు ఇప్పుడు’(Appudu Ippudu movie review). సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..

  • Share this:
రివ్యూ: అప్పుడు ఇప్పుడు
నటీనటులు: సుజన్, తనీష్క్ ,శివాజీరాజా, శ్రీనివాస్ పేరుపురెడ్డి, మాధవి, జబర్దస్త్ అప్పారావు తదితరులు
దర్శకత్వం: చలపతి పువ్వల
నిర్మాతలు: ఉషారాణి కనుమూరి, విజయ్ రామ కృష్ణమ్ రాజు
సినిమాటోగ్రఫీ: కళ్యాణ్ సమి
ఆర్ట్: ఠాగూర్
ఎడిటింగ్: వి.వి.ఎన్.వి.సురేష్
సంగీతం: పద్మానావ్ భరద్వాజ్

తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికీ ఎక్స్‌పైర్ అవ్వని జోనర్ ప్రేమకథా చిత్రాలు. ఎప్పటికప్పుడు కొత్తగా ప్రేమకథలు చేస్తూనే ఉంటారు దర్శకులు. కాస్త కొత్తదనం ఉన్నా ప్రేక్షకులు కూడా వీటి వైపు అడుగులు వేస్తుంటారు.. ఆదరిస్తుంటారు. తాజాగా మరో ప్రేమకథ కూడా అలాగే వచ్చింది. థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత చాలా చిన్న సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి. ఈ వారం అలా వచ్చిన సినిమా అప్పుడు ఇప్పుడు. సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..

కథ:
అర్జున్ (సుజన్)కు చదువుపై పెద్దగా ఆసక్తి ఉండదు. తనకు చదువు కంటే కూడా ఒకేసారి లైఫ్‌లో సెటిల్ అయిపోవాలని చూస్తుంటాడు. చదువు కంటే కూడా జాక్‌పాట్ లైఫ్‌పై ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాడు. ఒకే జీతంతో పని చేసే జీవితం కంటే కూడా.. ఒకేసారి సెటిల్ అయిపోయే లైఫ్ కోరుకునే చలాకీతనం ఉన్న కుర్రాడు. కానీ వాళ్ళ నాన్న అంటే మాత్రం హడల్. ఎప్పుడూ జాలీగా స్నేహితులతో తిరుగుతుంటాడు అర్జున్. అలాంటి సమయంలో అనుకోకుండా ఓ పెద్ద సమస్య వల్ల రెండు ఊర్లుగా విడిపోయిన ఊరిలోకి వచ్చి పడతాడు. ఈ క్రమంలోనే ఆ ఊరి నాయకుడు ZDTC కూతురు (తనిష్క్)ని చూసి ప్రేమలో పడతాడు. అమ్మాయి ప్రేమలో పడిన తర్వాత ఆ ఊరు గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. అసలు ఆ ఊరు విడిపోవడానికి కారణం ఏమిటి.. అసలు నాయకులు రెండు గ్రామాల ప్రజలను ఎలా మోసం చేస్తున్నారనే విషయాన్ని కనిపెడతాడు.. ఈ క్రమంలో అతనికి ఎదురైనా సంఘటనలు ఏమిటి అనేది కథ..

కథనం:
ఎన్నో సినిమాల్లో చూసినట్లుగానే సింపుల్ కథనే రాసుకున్నాడు దర్శకుడు చలపతి. దాని చుట్టూ ప్రేమకథను అల్లుకున్నాడు. అప్పుడెప్పుడో వచ్చిన రాముడొచ్చాడు నుంచి నిన్న మొన్నటి ఛలో వరకు కూడా రెండు ఊళ్ళ మధ్య కథలు చాలానే వచ్చాయి. అప్పుడు ఇప్పుడు సినిమాలో కూడా అలాంటి ఫార్మాట్ కథ కనిపించింది. అయితే ఇందులో ఆ మార్క్ మాత్రం అంతగా కనిపించలేదు. అయితే ఉన్నంతలో లో బడ్జెట్ అయినా కూడా తన శక్తి మేరకు కథను బాగానే ముందుకు నడిపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు చలపతి. తెలియని హీరో హీరోయిన్లు ఉండటం కూడా కొన్నిసార్లు సినిమాలకు మైనస్ అవుతుంది. అప్పుడు ఇప్పుడు సినిమా విషయంలో ఇదే జరిగింది. కథ బాగానే ఉన్నా.. స్క్రీన్ ప్లే మరింత టైట్‌గా ఉండే బాగుండేది. ఫస్టాఫ్ అంతా హీరో అల్లరి చిల్లరిగా తిరగడం.. సెకండాఫ్‌లో కథలోకి వెళ్లడం జరుగుతుంది. ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేసాడు దర్శకుడు చలపతి. కొత్త నటీనటులతో తనకు కావాల్సినట్లు చేయించుకున్నాడు. శివాజీ రాజా లాంటి సీనియర్లు సినిమాకు బాగానే హెల్ప్ అయ్యారు.

నటీనటులు:
ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు సుజన్. స్క్రీన్ పై చలాకీగా కనిపించాడు. నటుడిగా ఇంకాస్త ఎదగాలి.. ఎక్స్‌ప్రెషన్స్ విషయంలో మెరుగుపడాల్సి ఉంది. అయితే ఎనర్జీ బాగా వర్కవుట్ అయింది. డాన్సులు, ఫైట్స్ బాగానే చేసాడు. హీరోయిన్ తనీష్క్ తెలుగులో రెండు మూడు సినిమాలు చేసింది. ఆమె అందం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ట్రెండీతో పాటు ట్రెడిషనల్ లుక్‌లోనూ ఆకట్టుకుంది. హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ బాగానే ఉంది. మరో ముఖ్య పాత్రలో సీనియర్ నటుడు శివాజీరాజా బాగా నటించాడు. ఈయన పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. కానీ ఆయనను సరిగ్గా వాడుకోలేదు. ఇక మిగతా నటీనటులు శ్రీనివాస్ పేరుపురెడ్డి, మాధవి, జబర్దస్త్ అప్పారావు తదితరులు పర్లేదు అనిపించారు.

టెక్నికల్ టీం:
ఇలాంటి చిన్న సినిమాలు జనాల్లోకి వెళ్లాలంటే ముందుగా ఉండాల్సింది మంచి పాటలు. అప్పుడు ఇప్పుడు సినిమాకు సంగీత దర్శకుడు పద్మనావ్ భరద్వాజ్ తన పని తాను చేసాడు. ఫీల్ గుడ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇక కళ్యాణ్ సమి విజువల్స్ పర్లేదు. బడ్జెట్‌కు తగ్గట్లుగా ఈయన పని తనం ఉంది. అలాగే మాటలు బాగున్నాయి.. మంచి డైలాగ్స్ అక్కడక్కడా ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉండుంటే బాగుండేది. కొత్త వాళ్ళతో తీస్తున్నపుడు అంత లెంత్ ఉంచడం మంచిది కాదు. దర్శకుడు చలపతి పువ్వల గురించి చెప్పాలంటే ఓ సరికొత్త నేపథ్యంలో ఉన్న ప్రేమ కథను ఎంపిక చేసుకున్నప్పటికీ.. దాన్ని తెరకెక్కించే విషయంలో తడబడ్డాడు. కథ కంటే ఎక్కువగా ఎక్కువగా కామెడీపై ఫోకస్ చేసి గాడి తప్పినట్లు అనిపించింది. తాను అనుకున్న కథ, కథనాలను చక్కగా డ్రైవ్ చేసాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా :
ఓవరాల్‌గా అప్పుడు ఇప్పుడు.. కథ బాగున్నా.. కన్ఫ్యూజన్ ఎక్కువైంది..

రేటింగ్: 2.75/5
Published by:Praveen Kumar Vadla
First published: