Ram Gopal Varma - Srikanth Iyengar: వర్మ దేవుడు.. మిడిల్ ఫింగర్ చూపిస్తూ లీక్ అయిన వీడియోపై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీకాంత్ అయ్యర్!

Ram Gopal Varma - Srikanth Iyengar

Ram Gopal Varma - Srikanth Iyengar: టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అమ్మాయిలతో రెచ్చిపోతున్న వీడియో గత రెండు రోజుల నుండి వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దీంతో అతనిపై తెగ ట్రోలింగ్స్, నెగటివ్ కామెంట్స్ ఓ రేంజ్ లో వస్తున్నాయి.

  • Share this:
    Ram Gopal Varma - Srikanth Iyengar: టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అమ్మాయిలతో రెచ్చిపోతున్న వీడియో గత రెండు రోజుల నుండి వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దీంతో అతనిపై తెగ ట్రోలింగ్స్, నెగటివ్ కామెంట్స్ ఓ రేంజ్ లో వస్తున్నాయి. ఇక ఈ విషయం గురించి అక్కడే ఉన్న మరో సినీ నటుడు శ్రీకాంత్ అయ్యర్ తాజాగా కొన్ని విషయాలు బయట పెట్టాడు. రాంగోపాల్ వర్మ అన్న మాటలను కూడా తెలిపాడు.

    ఇటీవలే హీరోయిన్ ఇనయా సుల్తానా బర్త్ డే సెలబ్రేషన్స్ జరుగగా అందులో సినీ నటులు జ్యోతి, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. ఇక ఈ వేడుకకు సంబంధించిన పలు వీడియోలు నెట్టింట్లో బాగా వైరల్ గా మారాయి. అందులో వర్మ వాళ్ల ఇద్దర్ని ఎక్కడపడితే అక్కడ పట్టుకోవడం, ముద్దులు పెట్టుకోవడం డాన్స్ చేయడంతో బాగా హాట్ టాపిక్ గా మారింది.

    దీంతో తాజాగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఆ సెలబ్రేషన్స్ మొత్తం తన కొత్త ఇంట్లో జరిగాయని తెలిపాడు. వర్మ తనకు గాడ్ ఫాదర్ లాంటివాడని. దేవుడిని కూడా అంతగా నమ్మను అంటూ వర్మ గురించి పొగిడాడు. వర్మ తనకు ఫోన్ చేసి కొత్త ఇంట్లో ఉంటున్నావ్ కదా శ్రీకాంత్ మీ ఇంటికి రావచ్చా అనడంతో వెంటనే పిలిచాను అని తెలిపాడు. ఆయనతో పాటు ముగ్గురు ఫ్రెండ్స్ కూడా వచ్చారని అందులో హీరోయిన్ ఇనయా బర్త్ డే ఉండటంతో సెలబ్రేషన్స్ చేశామని తెలిపాడు.

    ఇక ఆ అమ్మాయితో వర్మ డాన్స్ చేస్తుంటే ఆ అమ్మాయి ఫీల్ అవ్వలేదని అన్నాడు. ఇక ఆ వీడియో బయటకు ఎలా వచ్చిందో కూడా తెలియదంటూ.. ఇక వర్మ.. మనకు ప్రాబ్లం ఏమి ఉండదు అని కానీ ఆ అమ్మాయిలకు ఏమైనా అయితే ఎలా అని అన్నాడని తెలిపాడు. ఇక తను గట్టి పిల్ల సార్ అని అన్నాడట. కొంతమంది తాలిబన్ బ్యాచ్ ఉంటారని వాళ్లను అసలు పట్టించుకోవద్దు అని అన్నానని తెలిపాడు. అమ్మాయిలపై నెగటివ్ కామెంట్స్ చేసే వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ.. అమ్మాయి గురించి మన దేశ సంస్కృతిలో నిజంగా మాట్లాడొచ్చని రాసి ఉంది కదా అంటూ వెటకారంగా మాట్లాడుతూ మిడిల్ ఫింగర్ చూపించాడు శ్రీకాంత్. ఇక తనకు వర్మ అంటే దేవుడని అందుకు ఆయనకు ఎంతో గౌరవం ఇస్తానని తెలిపాడు శ్రీకాంత్. ఇక శ్రీకాంత్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.
    Published by:Navya Reddy
    First published: