హోమ్ /వార్తలు /సినిమా /

నటుడు శివాజీ రాజాకు హార్ట్ ఎటాక్.. ఆస్పత్రికి తరలింపు..

నటుడు శివాజీ రాజాకు హార్ట్ ఎటాక్.. ఆస్పత్రికి తరలింపు..

నటుడు శివాజీ రాజా (actor shivaji raja)

నటుడు శివాజీ రాజా (actor shivaji raja)

Sivaji Raja: తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య వరసగా విషాదాలు జరుగుతున్నాయి. ఇవన్నీ మరిచిపోకముందే ఇప్పుడు మరో వార్త వచ్చింది. టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజాకు హార్ట్ ఎటాక్ వచ్చింది.

తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య వరసగా విషాదాలు జరుగుతున్నాయి. ఇవన్నీ మరిచిపోకముందే ఇప్పుడు మరో వార్త వచ్చింది. టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజాకు హార్ట్ ఎటాక్ వచ్చింది. ఉన్నట్లుండి ఈయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుఠాహుఠిన ఈయన్ని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడే ప్రస్తుతం ఈయనకు చికిత్స కొనసాగుతుంది. శివాజీ రాజా పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గతేడాది మా అసోసియేషన్ ఎన్నికలు ముగిసిన తర్వాత బయట పెద్దగా కనిపించడం లేదు ఈయన.

నటుడు శివాజీ రాజా (actor shivaji raja)
నటుడు శివాజీ రాజా (actor shivaji raja)

ఈ విషయంపై శివాజీ రాజా స్నేహితుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ఇప్పుడే ఆయనతో మాట్లాడాను.. బిపి డౌన్ అయిపోయి హార్ట్ఎటాక్ వచ్చింది.. స్టంట్ వేస్తారని చెప్పారని క్లారిటీ ఇచ్చాడు.  కొన్ని రోజులుగా సొంత ఫామ్‌హౌజ్‌లో కూరగాయలు పండిస్తూ సినిమా కార్మికులకు ఉచితంగా పంచి పెడుతున్నాడు. అయితే ఉన్నట్లుండి గుండెపోటు రావడంతో ఇండస్ట్రీ అంతా షాక్ అయిపోయింది. దాదాపు 30 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్న శివాజీ రాజా వందల సినిమాలు చేసాడు.. అమృతం సీరియల్‌తో నవ్వించాడు కూడా. తనకు త్వరగా నయం కావాలని కోరుకుంటుంది తెలుగు ఇండస్ట్రీ.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Shivaji Raja, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు