నటుడు సంపూర్ణేష్‌బాబు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఫైట్ సీన్ల చిత్రీకరణ భాగంగా సంపూ బైక్‌తో పాటు గాల్లో ఉండే షాట్ తీస్తున్నారు. ఈ క్రమంలో బైక్‌ను తాడుతో కట్టి కిందకు దింపుతుండగా అదుపుతప్పి ఆయన కిందపడిపోయారు. ‘బజారు రౌడీ’ చిత్రం షూటింగ్లో పాల్గోంటున్నా సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన సిబ్బంది సంపూను పైకి లేపి పక్కకు తీసుకెళ్ళారు. ఈ దృశ్యాలను మానిటర్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం సంపూ క్షేమంగానే ఉన్నట్లు సమాచారం.
వసంత నాగేశ్వరావు దర్శకత్వంలో ‘బజారు రౌడీ’ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది.
Published by:Rekulapally Saichand
First published:January 23, 2021, 14:08 IST