Sai Kumar: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు సాయికుమార్..

Sai Kumar: కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే అంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు సాయి కుమార్. 40 ఏళ్లుగా తెలుగు సినిమా చరిత్రలో దూసుకుపోతూనే ఉన్నాడు ఈయన.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 20, 2020, 10:40 PM IST
Sai Kumar: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు సాయికుమార్..
సాయి కుమార్ తిరుమల (sai kumar tirumala)
  • Share this:
కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే అంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు సాయి కుమార్. 40 ఏళ్లుగా తెలుగు సినిమా చరిత్రలో దూసుకుపోతూనే ఉన్నాడు ఈయన. ఇదిలా ఉంటే ఇప్పుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా భయపడుతున్నా.. స్వామి వారి దయతో అందరూ ధైర్యంగా ఉన్నారని చెప్పాడు సాయి కుమార్. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడే షూటింగ్ మొదలైంది.. అక్కడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపాడు ఈయన. మరోవైపు ప్రజలు కూడా కరోనా పట్ల‌ జాగ్రత్తగా ఉండాలని కోరాడు. పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసులకు సెల్యూట్ చేసాడు సాయి కుమార్. నిజమైన హీరోలు పోలీసులే అని ప్రశంసించాడు ఈయన. పోలీసు గెటప్ వేస్తేనే తమలో ఒక పౌరుషం కనిపస్తుంది.. నిజమైన పోలీసులకి ఇంకా ఎంత షౌరుషంగా ఉంటుందో అని చెప్పాడు ఈయన. పోలీస్ స్టోరి చేసి 25 సంవత్సరాలు పూర్తయిందని.. త్వరలోనే నాలుగో సింహం అని మరో పోలీస్ స్టోరీలో నటించబోతున్నట్లు కన్ఫర్మ్ చేసాడు సాయి.
సాయి కుమార్ తిరుమల (sai kumar tirumala)
సాయి కుమార్ తిరుమల (sai kumar tirumala)

60 ఏళ్ల వయసులో మరోసారి అదే పౌరుషం చూపించబోతున్నాడు ఈయన. ఈ నేపథ్యంలో తిరుపతి ఎస్‌పీ రమేష్ రెడ్డి ఐపిఎస్‌పై ప్రసంశల వర్షం కురిపించిన సాయి కుమార్.. పోలీస్ అధికారి యూనిఫామ్‌లో పొలంలో వరినాటడం తనకు నచ్చిందని తెలిపాడు. ఇలాంటి అధికారులు ప్రజల్లో ఎలా కలిసి కలిసిపోతారో అర్ధం చేసుకోవచ్చని తెలిపాడు. రమేష్ రెడ్డి లాంటి‌ అధికారి ఉన్న చోట మంచి‌ హ్యూమానిటీ కూడా ఉంటుందని.. కనిపించే‌ మూడు సింహాలు పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులే అని చెప్పాడు సాయి కుమార్.
Published by: Praveen Kumar Vadla
First published: October 20, 2020, 10:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading