హోమ్ /వార్తలు /సినిమా /

Sai Dharam Tej tweet: హాస్పిటల్ నుంచి సాయి ధరమ్ తేజ్ ట్వీట్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..

Sai Dharam Tej tweet: హాస్పిటల్ నుంచి సాయి ధరమ్ తేజ్ ట్వీట్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..

రోడ్డు ప్రమాదానికి గురైన మెగా మేనల్లుడు, నటుడు <a href="https://telugu.news18.com/photogallery/movies/vijayawada-amma-seva-prerana-samstha-old-age-home-people-praying-for-sai-dharam-tej-health-and-speedy-recovery-pk-1028250.html">సాయి ధరమ్‌ తేజ్‌</a> (Sai Dharam Tej) 35 రోజుల ట్రీట్మెంట్ తర్వాత అక్టోబర్ 15న డిశ్చార్జ్ అయ్యాడు. ఆయన ఇంటికి వెళ్లి కూడా మళ్లీ 10 రోజులు అయిపోయింది. అయినా ఇప్పటి వరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు సాయి ధరమ్ తేజ్.

రోడ్డు ప్రమాదానికి గురైన మెగా మేనల్లుడు, నటుడు <a href="https://telugu.news18.com/photogallery/movies/vijayawada-amma-seva-prerana-samstha-old-age-home-people-praying-for-sai-dharam-tej-health-and-speedy-recovery-pk-1028250.html">సాయి ధరమ్‌ తేజ్‌</a> (Sai Dharam Tej) 35 రోజుల ట్రీట్మెంట్ తర్వాత అక్టోబర్ 15న డిశ్చార్జ్ అయ్యాడు. ఆయన ఇంటికి వెళ్లి కూడా మళ్లీ 10 రోజులు అయిపోయింది. అయినా ఇప్పటి వరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు సాయి ధరమ్ తేజ్.

Sai Dharam Tej surgery: రోడ్డు ప్రమాదానికి గురైన సాయి ధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) గత 20 రోజుల నుంచి జూబ్లీ హిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులు చెప్తూనే ఉన్నారు. తాజాగా ఆయనే ట్వీట్ చేసాడు.

ఇంకా చదవండి ...

రోడ్డు ప్రమాదానికి గురైన మెగా మేనల్లుడు, నటుడు సాయి ధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) గత 20 రోజుల నుంచి జూబ్లీ హిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తూనే ఉన్నారు. ఆయనకు పూర్తిగా నయం అయేంత వరకు కూడా అక్కడే ఉండబోతున్నాడు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆయనకు ఎలాంటి సమస్యలు రాలేదని వైద్యులు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇక యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఆయనకు కాలర్ బోన్ విరిగింది. దానికి సర్జరీ చేయడానికి ముందు ఆలోచించారు డాక్టర్లు. ప్రమాదం జరిగిన తర్వాత 24 గంటల పాటు పూర్తిగా తమ పర్యవేక్షణలోనే ఉంచుకున్న వైద్యులు.. సెప్టెంబర్ 12 ఆదివారం ఉదయం ఆయనకు సర్జరీ నిర్వహించారు. ఇక అప్పట్నుంచి ఇప్పటి వరకు మళ్లీ ఆయన హెల్త్ బులెటిన్ అధికారికంగా విడుదల చేయలేదు. ఆయన ఎలా ఉన్నాడు అని అభిమానులు రోజూ ఆరా తీస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో ఉన్నట్లుండి సాయి ధరమ్ తేజ్ నుంచి ట్వీట్ వచ్చింది.

తాజాగా కోలుకున్న ఆయన.. హాస్పిటల్ నుంచి ట్వీట్ చేసాడు. ఇది చూసిన తర్వాత అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన అన్ని హెల్త్‌ బులెటిన్స్‌లోనూ  సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌లే వచ్చాయి. సాయి తేజ్‌ (Sai Dharam Tej accident) ఆరోగ్యం నిలకడగా ఉందని.. కోలుకుంటున్నాడని తెలిపారు వైద్యులు. ఆయన ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగవుతోందని చెప్పారు. కాలర్‌ బోన్‌ సర్జరీ తర్వాత సాయి స్పృహలోకి రావడానికి కాస్త సమయం తీసుకున్నా కూడా సెట్ అయిపోయిందని.. ఇప్పుడు పూర్తిగా సెట్ అయిపోయిందని తెలుస్తుంది. ఈయన కోసం వైద్య బృందం నిరంతరాయంగా కృషి చేస్తున్నారు. తాజాగా థమ్స్ అప్ అంటూ ట్వీట్ చేసాడు సాయి ధరమ్ తేజ్.


మీరు నాపై.. నా సినిమా రిపబ్లిక్‌పై చూపిస్తున్న ప్రేమకు థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదం.. త్వరలోనే మీ ముందుకు వస్తాను అంటూ ట్వీట్ చేసాడు సాయి ధరమ్ తేజ్. వినాయక చవితి సెప్టెంబర్ 10 సాయంత్రం 8 గంటల ప్రాంతంలో దుర్గం చెరువు ఫ్లై ఓవర్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా సాయి తేజ్‌ బైక్‌ నుంచి కిందపడి ప్రమాదానికి గురయ్యాడు. అక్కడ్నుంచి ఆయన్ని మెడి కవర్ ఆస్పత్రిలో చేర్పించి కాసేపు చికిత్స అందించారు. ఆ తర్వాత అపోలోకు తరలించి అక్కడ మెరుగైన వైద్యం అందించారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం కుదుటపడింది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు అపోలో హాస్పిటల్‌కు వెళ్లి సాయి తేజ్‌ను పరామర్శించి వచ్చారు. అభిమానులు కూడా సాయి తేజ్ త్వరగా కోలుకోవాలంటూ దేవున్ని ప్రార్థిస్తున్నారు. మొత్తానికి త్వరలోనే సాయి మళ్లీ మన ముందుకు రాబోతున్నాడన్నమాట.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Sai Dharam Tej, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు