Sai Dharam Tej: పండగ వేళ మెగా ఫ్యాన్స్‌కు శుభవార్త.. ఆస్పత్రి నుంచి సాయి ధరమ్ తేజ్ డిశ్చార్జ్

సాయి ధరమ్ తేజ్

Sai Dharam Tej: సాయిధరమ్ తేజ్ డిశ్చార్జ్ అవుతున్నారని తెలిసి మెగా అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. దసరా పండగ రోజు అదిరిపోయే శుభవార్త వచ్చిందని, ఆయన పుట్టిన రోజు నాడే డిశ్చార్జి కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రమాదం నుంచి కోలుకొని బర్త్ డే రోజున ఇంటికి రావడం నిజంగా పునర్జన్మ అని అభిప్రాయపడుతున్నారు.

  • Share this:
    విజయ దశమి పండగ వేళ మెగా అభిమానులకు అదిరిపోయే శుభవార్త. సాయిధరమ్ తేజ్ (Sai dharam Tej) ఆస్పత్రి నుంచి డిశ్చాజ్ అయ్యారు. రోడ్డు ప్రమాదం తర్వాత 35 రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్న సాయి ధరమ్ తేజ్.. దసరా (Dussehra 2021) పండగ రోజు అందులోనూ తన పుట్టిన రోజు నాడే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. సాయి ధరమ్ తేజ్ ఇవాళ ఇంటికి తిరిగొచ్చాడని ఆయన మావయ్య, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ట్వీట్ చేశారు. 'ఈ విజయ దశమి మరో ప్రత్యేకత ఏమిటంటే రోడ్డు ప్రమాదం నుంచి సంపూర్ణంగా కోలుకున్న సాయి ధరమ్ తేజ్ ఇవాళే  ఇంటికి వచ్చాడు. ప్రాణాపాయం నుంచి  తప్పించుకున్నందుకు సంతోషంగా ఉంది.  సాయిధరమ్ తేజ్‌కు ఇది పునర్జన్మ లాంటిది. అత్త, పెద్ద మావయ్య తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు.' అని చిరంజీవి ట్వీట్ చేశారు.


    బర్త్ డే తోపాటు దసరా రోజున ఇంటికి వస్తున్న సాయి ధరమ్ తేజ్‌కు మెగా హీరోలు అల్లు అర్జున్ (Allu Arjun), వరుణ్ తేజ్ (Varun Tej) పుట్టిన రోజు శుభకాంక్షలు చెప్పారు.




    కాగా, గత నెల 11న సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కేబుల్ బ్రిడ్జి సమీపంలో స్పోర్ట్స్ బైక్ జారిపోవడంతో ఆయన కిందపడ్డారు. ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్‌ తలతో పాటు ఛాతీ, కాళ్లకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయిధరమ్‌తేజ్‌ను 108 సాయంతో సమీపంలోని మెడికవర్‌ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే ఉన్నారు సాయి ధరమ్ తేజ్. 35 రోజుల ట్రీట్‌మెంట్ తర్వాత ఇవాళ డిశ్చార్జ్ అవుతున్నారు.

    సాయిధరమ్ తేజ్ డిశ్చార్జ్ అవుతున్నారని తెలిసి మెగా అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. దసరా పండగ రోజు అదిరిపోయే శుభవార్త వచ్చిందని, ఆయన పుట్టిన రోజు నాడే డిశ్చార్జి కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రమాదం నుంచి కోలుకొని బర్త్ డే రోజున ఇంటికి రావడం నిజంగా పునర్జన్మ అని అభిప్రాయపడుతున్నారు. ఇవాళ తమకు మూడు పండగలని.. ఒకటి దసరా, రెండు సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజు, మూడు ఆయన డిశ్చార్జ్ కావడమని అంటున్నారు. ఈ దసరగా పండగను ఎప్పటికీ మరచిపోలేమని చెబుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: