Sai Dharam Tej surgery: సాయి ధరమ్ తేజ్ కాలర్ బోన్ సర్జరీ పూర్తి.. వైద్యులు ఏమన్నారంటే..?

సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej)

Sai Dharam Tej surgery: రోడ్డు ప్రమాదానికి గురైన సాయి ధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) గత మూడు రోజుల నుంచి జూబ్లీ హిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తూనే ఉన్నారు.

  • Share this:
రోడ్డు ప్రమాదానికి గురైన మెగా మేనల్లుడు, నటుడు సాయి ధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) గత మూడు రోజుల నుంచి జూబ్లీ హిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తూనే ఉన్నారు. ఆయనకు పూర్తిగా నయం అయేంత వరకు కూడా అక్కడే ఉండబోతున్నాడు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆయనకు ఎలాంటి సమస్యలు రాలేదని వైద్యులు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇక యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఆయనకు కాలర్ బోన్ విరిగింది. దానికి సర్జరీ చేయడానికి ముందు ఆలోచించారు డాక్టర్లు. ప్రమాదం జరిగిన తర్వాత 24 గంటల పాటు పూర్తిగా తమ పర్యవేక్షణలోనే ఉంచుకున్న వైద్యులు.. సెప్టెంబర్ 12 ఆదివారం ఉదయం ఆయనకు సర్జరీ నిర్వహించారు. దీనికి సంబంధించిన బులెటిన్ కూడా మధ్యాహ్నం విడుదల చేసారు అపోలో వైద్యులు.

తాజా హెల్త్‌ బులెటిన్‌లో సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్ కూడా వచ్చింది. సాయి తేజ్‌ (Sai Dharam Tej accident) ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు వైద్యులు. ఆయన ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగవుతోందని చెప్పారు. కాలర్‌ బోన్‌ సర్జరీ కూడా విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. సాయి తేజ్‌ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు అపోలో డాక్టర్స్. ఈయన కోసం వైద్య బృందం నిరంతరాయంగా కృషి చేస్తున్నారు.

Bigg Boss 5 Telugu first Elimination: బిగ్ బాస్ 5 తెలుగు ఫస్ట్ ఎలిమినేషన్‌లో ఊహించని ట్విస్ట్.. చివరి నిమిషంలో షాక్..


వినాయక చవితి నాడు సెప్టెంబర్ 10 సాయంత్రం 8 గంటల ప్రాంతంలో దుర్గం చెరువు ఫ్లై ఓవర్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా సాయి తేజ్‌ బైక్‌ నుంచి కిందపడి ప్రమాదానికి గురయ్యాడు. అక్కడ్నుంచి ఆయన్ని మెడి కవర్ ఆస్పత్రిలో చేర్పించి కాసేపు చికిత్స అందించారు. ఆ తర్వాత అపోలోకు తరలించి అక్కడ మెరుగైన వైద్యం అందించారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం కుదుటపడింది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు అపోలో హాస్పిటల్‌కు వెళ్లి సాయి తేజ్‌ను పరామర్శించి వచ్చారు. అభిమానులు కూడా సాయి తేజ్ త్వరగా కోలుకోవాలంటూ దేవున్ని ప్రార్థిస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: