Rana Daggubati Health secrets: తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ వార్తల్లోనే ఉండే నటుడు రానా దగ్గబాటి. ఈయన జీవితం ఎప్పుడూ తెరిచిన పుస్తకమే. ఏదీ దాచుకోడానికి యిష్టపడడు రానా. సినిమాల విషయంలో కానీ.. వ్యక్తిగత జీవితం విషయంలో..
తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ వార్తల్లోనే ఉండే నటుడు రానా దగ్గబాటి. ఈయన జీవితం ఎప్పుడూ తెరిచిన పుస్తకమే. ఏదీ దాచుకోడానికి యిష్టపడడు రానా. సినిమాల విషయంలో కానీ.. వ్యక్తిగత జీవితం విషయంలో కానీ అన్నీ ఓపెన్‌గానే ఉంచాలని చూస్తుంటాడు. అలాంటి రానా జీవితంలో రెండేళ్ల కింద ఓ కుదుపు వచ్చింది. దాంతో అప్పటి వరకు ఉన్న రానా.. ఇప్పుడు మనం చూస్తున్న రానాకు చాలా తేడా వచ్చేసింది. ఒకప్పుడు ఉదయం 6 గంటల వరకు పార్టీ చేసుకునేవాడు రానా.. కానీ ఇప్పుడు అదే ఉదయం 6 గంటలకు నిద్ర లేచి యోగా చేస్తున్నాడు. అంత మారిపోయాడు ఆ ఒక్క సంఘటనతో. అసలేం జరిగింది అప్పుడు రానా జీవితంలో. ఎందుకు అలా మారిపోయాడు.. అసలెందుకు రానాకు అంత తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చాయి..? అంత చిన్న వయసులో రానా ఎందుకు చావు అంచుల వరకు వెళ్లొచ్చాడు..? చనిపోతాడని డాక్టర్లు చెప్పినా పోరాడిన రానా ధైర్యం వెనక అసలు నిజాలేంటి అనేది చాలా మందికి స్పూర్థినిచ్చే విషయమే. ఎందుకంటే పైకి చాలా ఆరోగ్యంగా కనిపించినా కూడా లోపల మాత్రం చావుతో పోరాడి గెలిచాడు రానా.
తాజాగా ఈయన సమంత అక్కినేని హోస్ట్ చేస్తున్న స్యామ్ జామ్ షోకు తన బాల్య మిత్రుడు, మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్‌తో కలిసి వచ్చాడు. అక్కడ తన అనారోగ్యంపై సమంత అడిగిన ప్రతీ ప్రశ్నకు సమాధానమిచ్చాడు. రెండేళ్ల కింద ఓ రోజు అరణ్య షూటింగ్ కోసం ప్రీ ప్రొడక్షన్ జరుగుతున్న సమయంలో కళ్లలో కాస్త మార్పులు చేయాలని దర్శకుడు ప్రభు సాల్మాన్ తనను కోరాడని చెప్పాడు రానా. అయితే తన కళ్ళపై అది వర్కవుట్ కాదని.. సర్జరీ చేయించుకుంటానని చెప్పి హాస్పిటల్‌కు వచ్చినట్లు తెలిపాడు రానా. అయితే అక్కడ బిపి చెక్ చేసిన డాక్టర్ 'నీ ఆరోగ్యం బాగానే ఉందా? నడుస్తున్నప్పుడు తల తిరుగుతున్నట్లు ఏమైనా అనిపిస్తోందా?' అని తనను అడిగినట్లు చెప్పాడు రానా.
అంతా బాగానే ఉంది.. తనకేం కాలేదని చెప్తున్నా కూడా మరో హాస్పిటల్‌కు వెళ్ళమని చెప్పారని.. అక్కడ ఆ ఆస్పత్రి హెడ్ వచ్చి ఏదో తేడా కొడుతుందని చెప్పినట్లు తెలిపాడు. ఇంకొన్ని టెస్టులు చేయాలని చెప్పినట్లు తెలిపాడు. బిపీ 220 వరకు వస్తుండటంతో ఎందుకు అలా జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదని చెప్పాడు రానా. తన ఆరోగ్య సమస్య ఎవరికీ అంతు దొరకడం లేదని.. దాంతో తన తండ్రి సురేష్ బాబుతో కలిసి అదే రోజు రాత్రి అమెరికా వెళ్లి అక్కడ ఓ హాస్పిటల్లో టెస్టులు చేయించుకున్నట్లు చెప్పాడు రానా. వాళ్లు వచ్చి సూటిగా సుత్తి లేకుండా తన ఆరోగ్యం గురించి చెప్పారని గుర్తు చేసుకున్నాడు దగ్గుబాటి వారసుడు. వాళ్లు చెప్పిన దాని ప్రకారం అప్పటికే కిడ్నీలు పాడయ్యాయని.. బిపి వల్ల శరీరంలో కొన్ని భాగాలు దెబ్బ తిన్నాయని చెప్పుకొచ్చాడు రానా.
రానా దగ్గుబాటి (rana daggubati)
ఆరోగ్యంగానే ఉన్నా కూడా వెంటనే చికిత్స తీసుకోకుంటే ఆర్నెళ్ళలో 70 శాతం స్ట్రోక్ వచ్చే అవకాశం.. 30 శాతం చనిపోయే ప్రమాదం ఉందని తెలిపినట్లు చెప్పాడు. దాంతో అంతా డీలా పడిపోయారని.. కానీ తాను మాత్రం వెంటనే నెక్ట్స్ ఏంటి.. అంటూ అక్కడే ట్రీట్మెంట్ తీసుకున్నట్లు చెప్పాడు రానా. అప్పటి వరకు ఉన్న అలవాట్లు మద్యపానం, ధూమపానం మానేసానని.. మాంసాహారం, ఉప్పు తినడం మానేసానని చెప్పాడు రానా. అప్పుడు తన జీవితంలో మోస్ట్ టఫ్ పీరియడ్ కానీ ఏ రోజు కూడా తను నిరుత్సాహపడలేదని.. ఎందుకు ఇలా జరుగుతుందని ప్రశ్నించుకోలేదని.. ఏం జరగాలో ఆలోచించుకున్నానని చెప్పాడు రానా. ఇప్పుడు మళ్లీ బౌన్స్ బ్యాక్ అయిపోయి.. ఈ మధ్యే లాక్డౌన్లో పెళ్లి కూడా చేసుకున్నాడు. ఏదేమైనా కూడా రానా జీవితంలో 2018 మాత్రం ఓ చీకటి ఏడాదిగా మిగిలిపోయింది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.