ఎక్కడో రష్యా-ఉక్రెయిన్ మధ్య మొదలైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. 20 రోజులుగా భీకర పోరు నడుస్తూనే ఉంది. ఇందులో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరెంతో మంది నిరాశ్రయులు అవుతున్నారు. అయితే ఈ యుద్ధంలో అనూహ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెర మీదకు వచ్చింది. నిజానికి ఉక్రెయిన్‌కి, చరణ్‌కి ఎలాంటి సంబంధం లేదు. కానీ రష్యా సైనికుల నుంచి తమ దేశాన్ని కాపాడుకుంటున్న ఒక ఉక్రెయిన్ పౌరుడికి, రామ్ చరణ్‌కు మాత్రం సంబంధం ఉంది. అసలు విషయం ఏంటంటే.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్.. కొంతకాలం ఉక్రెయిన్‌లో కూడా జరిగింది. అక్కడ కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించాడు దర్శకుడు రాజమౌళి.
ఆ షూటింగ్ జరిగే సమయంలో రస్తీ అనే వ్యక్తి చరణ్‌కు అక్కడ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేశారు. దీంతో చరణ్‌తో రస్తీకి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అక్కడ్నుంచి షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత కూడా రస్తీతో దోస్తీ మెయింటేన్ చేస్తున్నాడు చరణ్. ఇప్పుడు యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్ష్యుడి పిలుపు మేరకు 80 ఏళ్ళ రస్తీ తండ్రి, రస్తీ కూడా మిలిటరీలో చేరి తమ దేశాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. యుద్ధం కారణంగా రస్తీ ఆ దేశ పౌరులలానే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధం అనగానే తనకు ఉక్రెయిన్‌లో రక్షణ అందించిన రస్తీనే చరణ్‌కు ముందుగా గుర్తు వచ్చారు.
#RamCharan has helped a security officer in Kyiv, Ukraine, who previously operated as his personal security member during #RRR’s shoot in Ukrainian.@AlwaysRamCharan ? pic.twitter.com/rRx8XuGowF
— Suresh Kondi (@SureshKondi_) March 18, 2022
అందుకే ఆయనకు ఫోన్ చేసి బాగోగులు తెలుసుకున్నాడు. ఆయనకు వెంటనే ఫోన్ చేసి పలకరించగా రస్తీ పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. స్పందించిన చరణ్ రస్తీ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. చెర్రీ తనకు చేసిన సాయం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు రస్తీ. కొంత కాలమే ఆయన కోసం కలిసి పని చేసినా.. కష్టాల్లో ఉన్న తన కుటుంబాన్ని ఆదుకోవడం చరణ్ గొప్ప మనసుకి నిదర్శనమని రస్తీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో కూడా విడుదల చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హాస్పిటల్‌లో ఉన్న రస్తీ భార్య కోసం మెడిసిన్ కూడా పంపించాడు రామ్ చరణ్. ఇదే విషయాన్ని ఆయన తెలిపాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ram Charan, Telugu Cinema, Tollywood