తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ సుమ కనకాల. ఎంతమంది యాంకర్స్ వచ్చినా కూడా సుమ మాత్రం ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అంటూ అంతా ముక్తకంఠంతో చెప్తుంటారు. మలయాళీ అమ్మాయి అయినా కూడా తెలుగమ్మాయిలు కూడా సిగ్గుపడేలా తెలుగును స్పష్టంగా పలుకుతుంది ఈమె. ప్రతీ ఇంటి అమ్మాయిలా కలిసిపోయింది సుమ. ఈమె మాటలకు పడిపోని వాళ్లంటూ ఉండరు. అటు పర్సనల్.. ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌లో తిరుగులేకుండా వెళ్తున్న సుమపై ఆ మధ్య కొన్ని వార్తలు వినిపించాయి. ఇకపై ఈమె సుమ కనకాల కాదు.. కేవలం సుమ మాత్రమే.. పేరు వెనక కనకాల పక్కకెళ్లిపోతుందని ప్రచారం జరిగింది. అంటే భర్త రాజీవ్ కనకాలతో విడిపోతుందనే వార్తలు అయితే బాగానే వచ్చాయన్నమాట. అయితే దీనిపై తర్వాత సుమ, రాజీవ్ ఇద్దరూ బయటికి వచ్చి జరిగిన విషయం చెప్పారు. అసలు తమ మధ్య అలాంటిదేం లేదని.. కలిసే ఉన్నామని క్లారిటీ ఇచ్చారు. లేనిపోనివి రాసి పచ్చని మా కాపురంలో నిప్పులు పోయొద్దంటూ సుమ విజ్ఞప్తి చేసింది.
సుమ సంపాదన విషయంలో రాజీవ్ కనకాలకు పడటం లేదని.. ఆయన ఓర్చుకోలేకపోతున్నారని కొన్ని పుకార్లు అయితే వచ్చాయి. కానీ తనకు అలాంటివి సంబంధమే లేదని.. భార్య సంపాదన నుంచి రూపాయి కూడా అడగలేదని.. ఎంత సంపాదిస్తున్నావని ఏ రోజు తాను ప్రశ్నించలేదని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు రాజీవ్. కానీ ఇప్పుడు ఈ కారణమే వీళ్లను విడిపోయేలా చేస్తుందని ప్రచారం జోరుగానే చేసారు. మరీ ముఖ్యంగా రెండేళ్ల కింద సుమ అత్తగారు లక్ష్మి.. గతేడాది మామయ్య దేవదాస్ కనకాల.. మొన్నటికి మొన్న ఆమె ఆడపడుచు శ్రీలక్ష్మి చనిపోయారు. ఇలాంటి సమయంలో వాళ్ల విడాకులు అనే వార్తలను బాగా డిస్టర్బ్ చేసాయి.
అందుకే అప్పట్లో మీడియా ముందుకొచ్చి అలాంటిదేం లేదని చెప్పారు. అంతేకాదు మొన్నటికి మొన్న క్యాష్ ప్రోగ్రామ్‌లో భర్తను పట్టుకుని ఏడ్చేసింది సుమ. ఈ ఒక్క కార్యక్రమంతో తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు రాజీవ్ కనకాల కూడా ఇదే చెప్తున్నాడు. తమ మధ్య గొడవలు వచ్చాయనే నిజాన్ని అయితే ఒప్పుకున్నాడు. అయితే భార్యాభర్తలు అన్న తర్వాత కచ్చితంగా గొడవలు కామన్ అని.. అంత మాత్రానికే విడిపోతున్నారు.. విడిపోయారు అంటూ ప్రచారం చేయడం మాత్రం దారుణం అంటున్నాడు. గొడవ పడ్డాం.. మళ్లీ కలిసిపోయాం అంతేకానీ విడిపోలేదని చెప్పుకొచ్చాడు ఈయన.
విడాకులు తీసుకునేంత వరకు విషయం వచ్చిందనేది మాత్రం పచ్చి అబద్ధమని.. అలాంటి వార్తలు ప్రసారం చేసి మనోభావాలతో ఆడుకోవద్దంటూ చెప్పాడు రాజీవ్. నిజానిజాలు తెలుసుకోకుండా రాస్తే అనవసరంగా నష్టపోయేది తామే కదా అంటున్నాడు ఈయన. ఏదేమైనా కూడా ఇప్పుడు తమ ఫోకస్ అంతా కొడుకు రోషన్‌ను హీరోగా నిలబెట్టడంపైనే ఉందని చెప్పాడు రాజీవ్. మరి ఇప్పటికైనా వీళ్లపై ఈ గాసిప్స్ ఆగుతాయో లేదో..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor suma, Telugu Cinema, Tollywood