TOLLYWOOD ACTOR PRAKASH RAJ SENSATIONAL TWEET OVER MAA ELECTIONS AND HIS RESIGN TO MAA MEMBERSHIP PK
Prakash Raj: అందరి కథలు నాకు తెలుసు.. ‘మా’కు రాజీనామా చేసిన తర్వాత ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్..
ప్రకాష్ రాజ్ (Prakash Raj)
Prakash Raj: MAA ఎన్నికల్లో ఫలితం చూసిన తర్వాత ప్రకాష్ రాజ్ (Prakash Raj) సహా నాగబాబు (Naga Babu) కూడా మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఇద్దరి రిజైన్ లెటర్స్ మంచు విష్ణు దగ్గరికి వెళ్లాయి. అయితే అంతలోనే ప్రకాష్ రాజ్ మరో సంచలన ట్వీట్ కూడా చేసాడు.
మా ఎన్నికలు ముగిసిన తర్వాత రచ్చ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికల ముందు వరకు ఇరు వైపుల నుంచి రగడ సాగింది. అయితే ఎలక్షన్స్ అయిపోయాయి ఇప్పుడు. అందులో మంచు విష్ణు ప్యానెల్ ఘన విజయం సాధించింది. ఈసీ మెంబర్స్ జాబితాలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు ఎక్కువగానే గెలిచినా.. అసలైన పోస్టులకు మాత్రం మంచు విష్ణు ముందున్నాడు. అధ్యక్ష పీఠంతో పాటు మరికొన్ని కీలకమైన పదవులను సొంతం చేసుకున్నాడు విష్ణు. ఈ ఎన్నికల్లో ఫలితం చూసిన తర్వాత ప్రకాష్ రాజ్ సహా నాగబాబు కూడా మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఇద్దరి రిజైన్ లెటర్స్ మంచు విష్ణు దగ్గరికి వెళ్లాయి. అయితే వాటిని తాను ఆమోదించే ప్రసక్తే లేదని.. వాళ్ల అనుభవం తనకు ఉపయోగపడుతుందని.. వాళ్లను కలిసి మాట్లాడతాను అంటూ విష్ణు ఇప్పటికే చెప్పాడు. ఏదో ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలను తాను ఆమోదించలేనని చెప్పాడు.
అంతేకాదు.. ప్రకాష్ రాజ్‌కు ఇదే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేసాడు మంచు వారబ్బాయి. అయితే ప్రకాష్ రాజ్ రాజీనామా తర్వాత మా అసోసియేషన్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఇంతలోనే ఈయన మరో సంచలన ట్వీట్ చేసాడు. మా సభ్యత్వానికి తానెందుకు రాజీనామా చేసానో చెప్పే ప్రయత్నం చేసాడు ప్రకాష్ రాజ్.
Hi my dear MAA members who stood by us .. There is a deeper meaning behind my resignation to MAA. We as a team know we are responsible towards the love n support you all have extended to us. We will NEVER let you all down ..will explain very soon. you will be proud of us🤗🤗
హాయ్.. మా ప్రియమైన MAA సభ్యులు.. మాకు మద్దతుగా నిలిచిన వాళ్లందరికీ థ్యాంక్స్.. నేను MAAకి రాజీనామా చేయడం వెనుక లోతైన అర్థం ఉంది.. మీరందరూ మాకు అందించిన ప్రేమ, మద్దతు పట్ల మేము బాధ్యత వహిస్తున్నాం.. కచ్చితంగా మేమైతే మిమ్మల్ని నిరాశపరచము.. అతి త్వరలో అన్ని విషయాలు వివరిస్తాము. మీరు మా గురించి గర్వపడతారు అంటూ ట్వీట్ చేసాడు ప్రకాష్ రాజ్.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.