Mohan Babu - Prakash Raj: సీసీ ఫుటేజ్ వస్తే జాతకాలు బయటపడతాయి.. మోహన్ బాబుపై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు..

మోహన్ బాబు ప్రకాష్ రాజ్

Mohan Babu - Prakash Raj: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA Elections) ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఇండస్ట్రీలో ఉన్న కొందరు సినీ పెద్దలు (Mohan Babu - Prakash Raj) కూడా తమ పరువు పోతుందని.. ఇప్పటికైనా రచ్చ ఆపాలంటూ కోరుకుంటున్నారు.

  • Share this:
900 మంది సభ్యులు.. 600 మంది ఓట్లు పడిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. తిప్పి కొడితే మూడు గంటల్లో పోలింగ్.. మూడు గంటల్లో కౌంటింగ్ అయిపోయే ఎన్నికల కోసం ఇంత ఆర్భాటాలు అవసరమా అంటూ కామన్ ఆడియన్స్ కూడా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇండస్ట్రీలో ఉన్న కొందరు సినీ పెద్దలు కూడా తమ పరువు పోతుందని.. ఇప్పటికైనా రచ్చ ఆపాలంటూ కోరుకుంటున్నారు. చెప్పినా వినని వాళ్లకు చెప్పి కూడా లాభం లేదని.. అలాంటి వాళ్లకు ఏం చెప్తామని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఒక్కటైతే నిజం.. కచ్చితంగా మా పరువు మాత్రం కచ్చితంగా రోజురోజుకీ వాయిదాల లెక్కన తగ్గిపోతుంది. దాన్ని మాత్రం ఎవరూ కాదనలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ జరుగుతున్న రచ్చ కూడా అలాగే ఉంది. ముఖ్యంగా రోజుకో వివాదం బయటికి వస్తుంది. మా ఎన్నికలు పూర్తైపోయి 4 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ దీనిపై రచ్చ ఆగడం లేదు.

ఇప్పుడు మరో మలుపు తీసుకుంది. ఎన్నికలు జరిగే వరకూ రెండు ప్యానెల్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఉన్నట్లుండి ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి ఎన్నికైన 11 మంది సభ్యులూ రాజీనామాలు చేశారు. ఇక్కడే అసలు ట్విస్ట్ వచ్చింది. పైగా ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ప్రకాష్ రాజ్ లేఖ రాశారు. 'మా' పోలింగ్‌ సమయంలో మోహన్ బాబు చాలా దురుసుగా ప్రవర్తించారని ఈయన ఆరోపించారు. బండబూతులు తిట్టారని.. అక్కడున్న వాళ్లను బెదిరించారని చెప్పుకొచ్చాడు. చాలా విచక్షణారహితంగా మోహన్ బాబు ప్రవర్తన ఉందని ఆయన దుయ్యబట్టాడు.

MAA Elections - Manchu Vishnu: ప్రకాష్ రాజ్ ప్యానెల్ రాజీనామాల విషయంలో మంచు విష్ణు సంచలన నిర్ణయం..?


Star Heroes - Young Directors: కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు.. చిరంజీవి నుంచి రవితేజ అందరూ యంగ్ డైరెక్టర్స్‌తోనే..


మోహన్‌ బాబు, నరేష్ ప్రవర్తించిన తీరు అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డయిందని.. వాటిని చూస్తే ఎవరేంటి అనేది అప్పుడు అర్థమవుతుందని చెప్పాడు ప్రకాష్ రాజ్. ఆలస్యం చేస్తే అక్కడ సీసీ టీవీ ఫుటేజ్ కూడా మోహన్ బాబు డిలీట్ చేయిస్తాడని ప్రకాష్ చెప్పడం గమనార్హం. ఈ క్రమంలో సీసీ కెమెరా దృశ్యాలను తమకు అందించాలని ఎన్నికల అధికారిని కోరారు. సాధ్యమైనంత త్వరగా సీసీ ఫుటేజ్ తమకు ఇవ్వాలని ప్రకాష్ రాజ్ కోరాడు. పోలింగ్‌ రోజు మోహన్‌ బాబు, నరేష్ బెదిరింపులకు దిగారని ఆయన చెప్పారు. ప్రకాష్ రాజ్‌ లేఖపై ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కూడా స్పందించారు. పోలింగ్‌ రోజు నాటి సీసీ ఫుటేజిలు భద్రంగానే ఉన్నాయని.. నిబంధనల ప్రకారం ఫుటేజ్‌ను ప్రకాష్ రాజ్‌కు అందిస్తామని ఆయన వెల్లడించారు. మరి ఈ రచ్చ ఇంకా ఎంతదూరం వెళ్తుందో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published: