Home /News /movies /

TOLLYWOOD ACTOR PRAKASH RAJ GETS FIRE ON AP GOVERNMENT ABOUT PAWAN KALYAN BHEEMLA NAYAK TICKETS ISSUE PK

Pawan Kalyan - Prakash Raj: రాజకీయ క్షేత్రంలో చూసుకుందాం.. దొంగదెబ్బ తీస్తారా.. ఏపీ ప్రభుత్వంపై ప్రకాశ్ రాజ్ ఫైర్..

ప్రకాశ్ రాజ్ (ఫైల్ ఫోటో)

ప్రకాశ్ రాజ్ (ఫైల్ ఫోటో)

Pawan Kalyan - Prakash Raj: భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఏపీ (AP) లో అనుకున్న స్థాయిలో వసూళ్లు రావడం లేదు. దానికి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ టికెట్ రేట్లతో పాటు థియేటర్స్ కూడా క్లోజ్ చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఏపీ (AP) లో అనుకున్న స్థాయిలో వసూళ్లు రావడం లేదు. దానికి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ టికెట్ రేట్లతో పాటు థియేటర్స్ కూడా క్లోజ్ చేస్తున్నారు. దాంతో దారుణంగా కలెక్షన్ప్ పడిపోతున్నాయి. ముఖ్యంగా కొన్ని ఏరియాలలో అయితే సినిమా థియేటర్స్ స్వచ్ఛందంగా మూసేస్తున్నారు ఓనర్లు. ప్రభుత్వం నియమించిన రేట్లకు తాము టికెట్స్ అమ్మలేం అంటూ వాళ్లకు వాళ్లే సినిమాను నిలిపేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ విషయంపై నటుడు, నిర్మాత, దర్శకుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) స్పందించాడు. ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ (Pawan kalyan) భీమ్లా నాయక్ సినిమాపై వాళ్లు వ్యవహరిస్తున్న తీరును దారుణంగా తప్పు పట్టాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.

పవన్ కళ్యాణ్ సినిమాను సపోర్ట్ చేస్తూ.. ఆయన చేసిన ట్వీట్ సంచలనం రేపుతుంది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించాడు. ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకోవాలే కానీ పర్సనల్‌గా టార్గెట్ చేస్తూ.. సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టడం అనేది సరైన పద్దతి కాదంటూ ఆయన దుయ్యబట్టాడు. ఈ క్రమంలోనే ఈయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. #BheemlaNayak, #GovtofAndhrapradesh హ్యాష్ ట్యాగ్‌తో చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

సృజన, సాంకేతికత మేళవించిన సినిమా రంగంపై అధికార దుర్వినియోగం, అధిపత్య ధోరణి ఏమిటీ ? అంటూ నిలదీశారు. చిత్ర పరిశ్రమను క్షోభపెడుతూ మేమే ప్రోత్సాహిస్తున్నామంటే నమ్మలా ? అంటూ ప్రశ్నించారు. ఏవైనా ఉంటే.. రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలి..కక్ష సాధింపులు బాక్సాపీస్ దగ్గర ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతగా ఇబ్బంది పెట్టినా… ప్రేక్షకుల ఆదరాభిమానాలకు ఎవరూ అడ్డుకట్ట వేయలేరని ప్రకాశ్ రాజ్ ట్వీట్‌లో వెల్లడించాడు. ఇండస్ట్రీ సమస్యలు తీరుస్తాడనే కదా ఈ మధ్య ఎక్కువగా సినీ ప్రముఖులు సిఎం జగన్‌ను (CM YS Jagan) కలుస్తున్నారు.. అయినా కూడా ఆయన స్పందించకపోగా ఇప్పటికీ అదే కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ జగన్‌పై కొందరు సినీ ప్రముఖులు ఇప్పటికీ విమర్శలు చేస్తూనే ఉన్నారు. మరి ఈ విషయంపై ముఖ్యమంత్రి ఎప్పటికి తీపి కబురు చెప్తాడో చూడాలి. అప్పటి వరకు సినిమాలకు ఈ కలెక్షన్స్ ఇబ్బంది తప్పకపోవచ్చు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Bheemla Nayak, Pawan kalyan, Prakash Raj, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు