Prakash Raj on Maa Elections: తెగేదాకా లాక్కండి.. మా ఎన్నికలపై ప్రకాశ్ రాజ్ సంచలన ట్వీట్..?

ప్రకాశ్ రాజ్ (Prakash Raj)

Prakash Raj on Maa Elections: ఎప్పుడూ లేని విధంగా ఈ సారి మాత్రం మా ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగనున్నాయి. రసవత్తరంగా అనే పదం ఎందుకు వాడుతున్నారంటూ మీడియాను సీనియర్ నటుడు, మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగిన ప్రకాష్ రాజ్(Prakash Raj on Maa Elections) ప్రశ్నించాడు..

  • Share this:
ఎప్పుడూ లేని విధంగా ఈ సారి మాత్రం మా ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగనున్నాయి. రసవత్తరంగా అనే పదం ఎందుకు వాడుతున్నారంటూ మీడియాను సీనియర్ నటుడు, మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగిన ప్రకాష్ రాజ్ ప్రశ్నించాడు కానీ అక్కడ జరుగుతున్న పరిస్థితులు.. మారుతున్న పరిణామాలు చూసిన తర్వాత ఈ పదాలు వాడకుండా ఎలా రాస్తారు మరి..? ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. మరోసారి మా ఎన్నికలు రసవత్తరంగానే సాగడానికి రంగం సిద్ధమవుతుంది. ఓ వైపు సీనియర్స్ అంతా కలిసి ఈ సారి ఏకగ్రీవం అవుతుందని చెప్తున్నారు.. మరోవైపు ప్రకాశ్ రాజ్ లాంటి వాళ్లు మాత్రం దీనిపై ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు. అయితే తాజాగా ఈయన చేసిన ఓ ట్వీట్ సంచలనంగా మారుతుంది. ఇండస్ట్రీలో తీవ్రస్థాయిలో చర్చకు దారి తీస్తుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై చెలరేగిన రచ్చను మరింత పెంచేలా ప్రకాశ్ రాజ్ ఓ ట్వీట్ చేసాడు.

తెగేదాకా లాక్కండి.. జస్ట్ అడుగుతున్నా అంటూ ఈయన ట్వీట్ చేసాడు. మా ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి.. ఎలా నిర్వహించాలి.. ఒకవేళ నిర్వహిస్తే ఎలాంటి రచ్చ జరక్కుండా ఎలా పూర్తి చేయాలనే విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు సినీ పెద్దలు. ఎలాంటి గొడవలు లేకుండా సామరస్యంగా ఈ ఎన్నికలను పూర్తి చేయాలని చాలా మంది భావిస్తున్నారు. ఒకవేళ ఎన్నికలే వద్దనుకుంటే.. ఏకగ్రీవంగా ఎవర్ని కూర్చోబెట్టాలనే విషయంపై కూడా తల పట్టుకుంటున్నారు సో కాల్డ్ సినీ పెద్దలు.

maa elections,maa elections naresh press meet,maa president elections,maa president elections naresh press meet,maa president elections war,maa president prakash raj,maa president manchu vishnu,maa president jeevitha rajasekhar,telugu cinema,ప్రకాశ్ రాజ్ మా ప్రెసిడెంట్,మంచు విష్ణు మా ప్రెసిడెంట్,జీవిత రాజశేఖర్ మా ప్రెసిడెంట్,మా ప్రెసిడెంట్ నరేస్ ప్రెస్ మీట్
మా ప్రెసిడెంట్ నరేష్ (MAA Naresh)


ఈ మధ్యే ప్రస్తుత మా ఎగ్జిక్యూటివ్ కమిటీలోని 15 మంది సభ్యులు క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లెటర్స్ రాయడం సంచలనంగా మారింది. ప్రస్తుత కార్య నిర్వాహక కమిటీకి కాలం చెల్లిందని.. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఈ లేఖలో కొందరు పేర్కొన్నారు. ఈ లెటర్ రాసిన తర్వాత మా ఎన్నికలపై కొనసాగుతున్న సందిగ్ధతకు తెరదించాలనే ఉద్దేశ్యంతో కృష్ణంరాజు, మురళీ మోహన్, మోహన్ బాబు, శివకృష్ణ లాంటి కొందరు పెద్దలు కలిసి వర్చువల్ మీటింగ్‌ నిర్వహించి ఎన్నికల నిర్వహణపై చర్చించారు.


అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్టులోనే మా జనరల్‌ బాడీ సమావేశం జరగనుందని.. ఆ తర్వాత వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని వాళ్లు చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. సెప్టెంబర్‌ 12న అధ్యక్ష ఎన్నికలు జరిపే పరిస్థితి కనిపిస్తుందని ఇండస్ట్రీలో ఓ వర్గం ప్రచారం కూడా చేస్తుంది. ఈ తరుణంలో ప్రకాష్ రాజ్ చేసిన ఓ ట్వీట్ ఆసక్తిగా మారింది. తెగేదాకా లాక్కండి.. Just Asking అంటూ ట్యాగ్ చేసాడు. ఇది మా ఎన్నికలను ఉద్దేశించే చేసిన పోస్ట్‌ అని అందరికీ అర్థమవుతుంది.. అయితే అది ఎవర్ని ఉద్దేశించి చేసాడనేది మాత్రం సస్పెన్స్. మరి తెగేదాకా లాగాలని చూస్తున్నదెవరో..?
Published by:Praveen Kumar Vadla
First published: