Home /News /movies /

TOLLYWOOD ACTOR POSANI MURALI KRISHNA IN OMKAR SIXTH SENSE SEASON 4 SHOW IN STAR MAA NR

Omkar - Sixth Sense 4: ఓంకార్ కాళ్లు పట్టుకున్న పోసాని మురళీకృష్ణ.. అసలేం జరిగిందంటే?

sixth sense season 4, posani murali krishna

sixth sense season 4, posani murali krishna

Omkar - Sixth Sense 4: తెలుగు సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత పోసాని కృష్ణ మురళి గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. ఎన్నో సినిమాలలో సహాయ పాత్రలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

    Omkar - Sixth Sense 4: తెలుగు సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత పోసాని కృష్ణ మురళి గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. ఎన్నో సినిమాలలో సహాయ పాత్రలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక బుల్లితెరపై కూడా ఓ సీరియల్ లో నటించాడు. ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ సహాయ పాత్రలలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే పోసాని.. బుల్లితెర యాంకర్ ఓంకార్ కాళ్లు పట్టుకొని తెగ బతిమాలుకున్నాడు.

    ప్రస్తుతం స్టార్ మాలో ఓంకార్ హోస్టింగ్ చేస్తున్న రియాలిటీ షో సిక్స్త్ సెన్స్ ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ షోలో సెలబ్రేట్ లను ఆహ్వానించి వారిని ఆటలో లీనమయ్యేలా చేస్తూ వన్ సెకండ్ అంటూ సెలబ్రెటీలను తెగ టెన్షన్ పెడుతుంటాడు ఓంకార్. ఇదిలా ఉంటే ఇప్పటికే మూడు సీజన్ లు పూర్తయిన ఈ షో ప్రస్తుతం నాలుగవ సీజన్ తో బాగా సందడిగా సాగుతుంది. ఇక తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ గా మారింది.

    ఇక ఈ వారం ఇందులో పోసాని కృష్ణ మురళి, శివ శంకర్ మాస్టర్ పాల్గొనగా.. ఓంకార్ మాత్రం పోసాని కృష్ణ మురళితో ఓ రేంజ్ లో ఆడుకున్నట్లు కనిపిస్తుంది. ఇక గేమ్ లో భాగంగా ఓంకార్ గన్ ఛాలెంజ్ తో పోసాని వైపు చూపిస్తూ షూట్ చేస్తున్నట్లు బెదిరించగా అందులో పోసాని నిజంగానే తనను షూట్ చేస్తాడేమో అని భయపడిపోయాడు. ఓడిపోయానని ఒప్పుకుంటాను అని కూడా అనడంతో ఓంకార్ అలాగే భయపడిస్తుండగా అమ్మ తోడు అంటూ తెగ బతిమాలుకుంటున్నాడు పోసాని.








    View this post on Instagram






    A post shared by STAR MAA (@starmaa)






    చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అంటూ.. భార్య బిడ్డలు ఉన్నారని వేడుకుంటూ.. వాళ్ల కోసమైనా ఉండనివ్వండి అంటూ వేడుకున్నాడు. ఇక ఓంకార్ ఇందులో డమ్మీ బుల్లెట్ ఉంది అని చెప్పడంతో.. వెంటనే అయ్యయ్యో అంటూ ఓంకార్ కాళ్ళు పట్టుకున్నాడు. అక్కడ కాస్త ఫన్నీగా అనిపించింది. ఇక తను పట్టుకున్న గన్ లో బుల్లెట్ ఉందో లేదో చెక్ చేయమని ఓంకార్ అనడంతో.. అక్కడ పోసాని కాస్త ఓవర్ స్టైల్ లో గన్ పట్టుకొని పేల్చాడు.ఇక అందులో బుల్లెట్ ఉండటంతో తెగ భయపడిపోయాడు పోసాని.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Anchor omkar, Murali krishna, Sixth sense season 4, Star Maa

    తదుపరి వార్తలు