హైదరాబాద్: పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పోసానితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. త్వరలోనే కోలుకుని మళ్లీ షూటింగ్స్‌కు హాజరవుతానని పోసాని చెప్పారు. అయితే.. తనకు కరోనా సోకిన కారణంగా సినిమా షూటింగ్స్ ఆగిపోవడం బాధగా ఉందని పోసాని ఆవేదన వ్యక్తం చేశారు. తాను నటిస్తున్న రెండు పెద్ద సినిమాల షూటింగ్స్ ఈ కారణంగా వాయిదా పడే అవకాశం ఉందని, అందుకు తనను మనస్ఫూర్తిగా క్షమించాలని నిర్మాతలను ఆయన కోరారు. పోసాని అటు సినిమాలతో పాటు ఇటు బుల్లితెరపైన కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Posani Krishna Murali, Telugu Cinema News, Tollywood, Tollywood actor