బతకనేమో అనుకున్నా.. కంటతడి పెట్టించిన పోసాని కృష్ణ మురళి

పోసాని కృష్ణమురళి

తన ఆరోగ్య పరిస్థితి గురించి పోసాని చెప్పిన మాటలు విని చాలా మంది అభిమానులు కంటతడిపెట్టారు. మీరు ఆరోగ్యంగా ఉండాలి సార్.. అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

  • Share this:
    ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి పట్టి పీడిస్తోంది. లక్షలాది మంది కరోనా బారినపడి బాధపడుతున్నారు. ఐతే తెలుగు రాష్ట్రాల్లోకి కరోనా రాకకు కొన్ని రోజుల ముందు టాలీవుడ్ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి తీవ్ర అనారోగ్య సమస్యతో ఇబ్బందులు పడ్డారట. రోజుల పాటు విడవని జ్వరంతో అల్లాడిపోయారట. ఈ విషయాన్ని స్వయంగా పోసాని కృష్ణమురళే చెప్పారు. జబర్దస్త్ కమెడియన్స్ చలాకీ చంటి, తాగుబోతు రమేష్, రచ్చరవితో పాటు పోసాని ఈటీవీ 'క్యాష్' ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తన అనారోగ్య సమస్యలు, తాను పడిన బాధను యాంకర్ సుమతో పంచుకున్నారు.

    ''కరోనాకు ముందు తీవ్రమైన కడుపు నొప్పి వేధించింది. హెర్నియా ఆపరేషన్ చేయించుకున్నా. ఆ తర్వాత 4 రోజులకు ఇంట్లో పడిపోయా. 105 జ్వరం వచ్చింది. మళ్లీ ఆస్పత్రికి వెళ్తే ఇన్‌ఫెక్సన్ అన్నారు. ఏ ఇన్‌ఫెక్షనో తెలియడానికి నెల పట్టింది. బరువు కూడా బాగా తగ్గా. 78 నుంచి 71 కిలోలకు తగ్గిపోయా. బాగా జ్వరం రావడం..డాక్టర్లు ఇంజెక్షన్ ఇవ్వడం. ఇంజెక్షన్ ఇచ్చాక మళ్లీ 5 నిమిషాలకు మళ్లీ జ్వరం రావడం. కొన్ని రోజుల పాటు ఇలానే ఉంది. ఆ పరిస్థితి చూసి ఇక బతకనేమో అని అనుకున్నా. చివరకు తెలిసిన డాక్టర్ లండన్ నుంచి వచ్చి చెక్ చేశాడు. హెర్నియా ఆపరేషన్ మళ్లీ చేయాలని చెప్పాడు. ఆ సర్జరీ అయిన గంటకే జ్వరం పూర్తగా తగ్గిపోయింది.'' అని వివరించారు పోసాని కృష్ణ మురళి. తన ఆరోగ్య పరిస్థితి గురించి పోసాని చెప్పిన మాటలు విని చాలా మంది అభిమానులు కంటతడిపెట్టారు. మీరు ఆరోగ్యంగా ఉండాలి సార్.. అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: