20 ఏళ్ళ కుర్రాడికి 60 ఏళ్ళ భార్య.. భిన్నమైన కథతో ‘సావిత్రి W/O సత్యమూర్తి..’

సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి (savithri w/o satyamurthy)

Savitri W/O Satyamurthy: ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో పాత కథల కంటే కూడా కొత్త తరహా కథలే ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా భిన్నంగా ఉండే కథలకు హీరోలు కూడా ఓటేస్తున్నారు.

  • Share this:
ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో పాత కథల కంటే కూడా కొత్త తరహా కథలే ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా భిన్నంగా ఉండే కథలకు హీరోలు కూడా ఓటేస్తున్నారు. ప్రయోగాత్మక కథలు అంటే మొన్నటి వరకు తమిళం, మలయాళం వైపు ఆసక్తిగా చూసేవాళ్ళు మన హీరోలు. అయితే ఇప్పుడు మన దగ్గరే అలాంటి కథలు వస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. తాజాగా 20 ఏళ్ళ కుర్రాడు.. 60 ఏళ్ళ బామ్మను పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అనే కథతో ఓ సినిమా వస్తుంది. దాని పేరు సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి. చైతన్య కొండ అనే దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కేరింత సినిమాలో శ్రీకాకుళం యాసతో అందర్నీ ఆకట్టుకున్న పార్వతీశం ఇందులో హీరోగా నటిస్తున్నాడు. 20 ఏళ్ల కుర్రాడికి 60 ఏళ్ల బామ్మ భార్యగా ఉంటే అనే ఊహే కొత్తగా ఉంది. అలాంటి కథతో సినిమా చేస్తున్నాడు కొత్త దర్శకుడు చైతన్య.

మహేంద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై గోగుల నరేంద్ర ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ బాగానే ఉంది. ఇందులో పార్వతీశం భార్యగా.. 60 ఏళ్ళ బామ్మగా సీనియర్ లేడీ కమెడియన్ శ్రీలక్ష్మి నటిస్తున్నారు.
Savitri W/O Satyamurthy movie,Savitri W/O Satyamurthy movie first look,Savitri W/O Satyamurthy parvateesam movie,Savitri W/O Satyamurthy sri lakshmi,telugu cinema,20 year boy 60 year old lady Savitri W/O Satyamurthy movie,సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి,పార్వతీశం శ్రీ లక్ష్మి సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి సినిమా
సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి (savithri w/o satyamurthy)

ఈ సినిమాకు ప్రమోషన్ కూడా అలాగే చేస్తున్నారు. 20 ఏళ్ల కుర్రాడు.. 60 ఏళ్ల భార్య అనేది గట్టిగా వాడుకుంటున్నారు. పోస్టర్ ఆసక్తికరంగానే ఉంది. ఇలాంటి కథతో ప్రేక్షకులను మెప్పించడం అంటే చిన్న విషయం కాదు. కానీ మెప్పిస్తామంటున్నారు దర్శక నిర్మాతలు. మరి చూడాలిక.. పార్వతీశం ఈ సినిమాతో ఎంతవరకు మెప్పిస్తాడో..?
Published by:Praveen Kumar Vadla
First published: