Nithiin Marriage: తన పెళ్లికి కేసీఆర్‌ను ఆహ్వానించిన నితిన్..

Nithiin Marriage: చాలా రోజులుగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన నితిన్ పెళ్లి చివరికి జూలై 26న హైదరాబాద్‌లో రాత్రి 8:30 గంటలకు జరగనుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 20, 2020, 6:38 PM IST
Nithiin Marriage: తన పెళ్లికి కేసీఆర్‌ను ఆహ్వానించిన నితిన్..
పెళ్లికి కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్న నితిన్ (nithiin KCR)
  • Share this:
చాలా రోజులుగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన నితిన్ పెళ్లి చివరికి జూలై 26న హైదరాబాద్‌లో రాత్రి 8:30 గంటలకు జరగనుంది. అదే ముహూర్తానికి షాలిని మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు యంగ్ హీరో నితిన్. ఈ పెళ్లి ఏర్పాట్లు కూడా ఇప్పటికే మొదలైపోయాయి. ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలను అనుసరిస్తూ, తగిన జాగ్రత్తలు పాటిస్తూనే తన వివాహం జరపాలని చూస్తున్నాడు నితిన్. ఈ వేడుకకు కేవలం రెండు కుటుంబాలతో పాటు కొందరు సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు.
షాలినీతో నితిన్ Photo : Twitter
షాలినీతో నితిన్ Photo : Twitter


ఈ మేరకు తన పెళ్లికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించేందుకు నితిన్ ప్రగతి భవన్‌కు వెళ్లాడు. పెళ్లికి హాజరై మా దంపతులను ఆశీర్వదించాలని కేసీఆర్‌ను నితిన్ కోరాడు. ముందు నుంచి కూడా తన పెళ్లిని చాలా గ్రాండ్‌గా జరపాలని ప్లాన్ చేసాడు నితిన్. అందుకే చాలా రోజుల పాటు వాయిదా వేసుకుంటూ వచ్చాడు. అయితే ఎప్పటికీ పరిస్థితులు చక్కబడకపోవడంతో చివరికి అతి తక్కువ మంది సమక్షంలోనే నిరాడంబరంగా ఈ పెళ్లి జరగనుంది.

తెలంగాణ స్టార్ హీరో అయిన నితిన్ వేడుకకు సీఎం కేసీఆర్‌తో పాటు మరికొంత మంది పెద్దలను కూడా ఆహ్వానించనున్నారు కుటుంబ సభ్యులు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఇప్పటికే భీష్మ సినిమాతో హిట్ కొట్టిన నితిన్.. ప్రస్తుతం వెంకీ అట్లూరీతో 'రంగ్ దే'.. చంద్రశేఖర్ యేలేటి 'చెక్'.. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'అంధాధున్' రీమేక్‌.. కృష్ణచైతన్య దర్శకత్వంలో 'పవర్ పేట' సినిమాలు చేస్తున్నాడు.
Published by: Praveen Kumar Vadla
First published: July 20, 2020, 6:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading