హోమ్ /వార్తలు /సినిమా /

Srikanth - Naresh: నా కళ్ళ ముందు హీరో అయ్యావ్.. జాగ్రత్తగా మాట్లాడు అంటూ శ్రీకాంత్ పై నరేష్ ఫైర్?

Srikanth - Naresh: నా కళ్ళ ముందు హీరో అయ్యావ్.. జాగ్రత్తగా మాట్లాడు అంటూ శ్రీకాంత్ పై నరేష్ ఫైర్?

ముఖ్యంగా సీనియర్ నరేష్ అందరిపై నోరు పారేసుకున్నాడు. ప్రకాష్ రాజ్ ప్యానల్ అయితే నరేష్ అంటేనే మండిపడుతున్నారు. ఈ రోజు మా అసోసియేషన్ మసక బారిందంటే కారణం నరేష్ అంటూ నాగబాబు సహా చాలా మంది విమర్శించారు. ఉత్తేజ్ అయితే ఉతికి ఆరేసాడు. నాగబాబు కూడా నరేష్ లాంటి చెత్త ప్రెసిడెంట్‌ను ఇప్పటి వరకు చూడలేదని.. కేవలం అతడి వల్లే ఇదంతా జరిగిందంటూ విమర్శించాడు.

ముఖ్యంగా సీనియర్ నరేష్ అందరిపై నోరు పారేసుకున్నాడు. ప్రకాష్ రాజ్ ప్యానల్ అయితే నరేష్ అంటేనే మండిపడుతున్నారు. ఈ రోజు మా అసోసియేషన్ మసక బారిందంటే కారణం నరేష్ అంటూ నాగబాబు సహా చాలా మంది విమర్శించారు. ఉత్తేజ్ అయితే ఉతికి ఆరేసాడు. నాగబాబు కూడా నరేష్ లాంటి చెత్త ప్రెసిడెంట్‌ను ఇప్పటి వరకు చూడలేదని.. కేవలం అతడి వల్లే ఇదంతా జరిగిందంటూ విమర్శించాడు.

srikanth - Naresh: ఈమధ్య సినీ నటుడు నరేష్ తరచు వార్తల్లో నిలుస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి వార్తల్లోకి రాగా ఈసారి వివాదాన్ని సృష్టించాడు. శుక్రవారం రోజు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే

srikanth - Naresh: ఈమధ్య సినీ నటుడు నరేష్ తరచు వార్తల్లో నిలుస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి వార్తల్లోకి రాగా ఈసారి వివాదాన్ని సృష్టించాడు. శుక్రవారం రోజు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు ప్రమాదం గురించి పలు రకాలుగా స్పందించారు. ఇక నటుడు నరేష్ కూడా స్పందించడంతో ప్రస్తుతం ఆ మాటలు వివాదంగా మారాయి. అంతేకాకుండా హీరో శ్రీకాంత్ పై కూడా ఫైర్ అయినట్లు కనిపించింది.

హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ పట్ల నరేష్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీయడంతో.. శ్రీకాంత్, బండ్ల గణేష్ అతడిపై కాస్త ఫైర్ అయినట్లు కనిపించింది. అంతే కాకుండా పలువురు సినీ ప్రముఖులు కూడా నరేష్ చేసిన వ్యాఖ్యల పట్ల తప్పుబట్టారు. ఇక శ్రీకాంత్ నరేష్ మాట్లాడిన మాటల గురించి తెలుపుతూ.. తనకు నరేష్ పెట్టిన బైట్ బాధ కలిగించిందని తెలిపాడు.

ఇలాంటి బైట్స్ పెట్టొద్దు అంటూ.. సాయి తేజ్ ర్యాష్ గా వెళ్లే వ్యక్తి కాదు అంటూ.. ఈ సమయంలో తమ కుటుంబ సభ్యులు బాధలో ఉంటారు. నరేష్ అలా వ్యాఖ్యలు చేయడం నచ్చలేదు అంటూ.. చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు అని మరోసారి ఇలాంటివి పెట్టకూడదు అని ఘాటుగా స్పందించాడు శ్రీకాంత్.ఇక నరేష్ కూడా శ్రీకాంత్ మాటలకు స్పందించగా.. నువ్వే ఆలోచించి మాట్లాడు.. 50 సంవత్సరాల ఇండస్ట్రీ అనుభవంలో ఇంతవరకు ఎవరు నా గురించి ఇలా మాట్లాడలేదు. నా బైట్స్ మీద నువ్వు ఇచ్చిన బైట్ చూశాను. ఏంటమ్మా నువ్వు ఎందుకు అలా ఇచ్చావ్.. నువ్వు జాగ్రత్తగా ఉండాలి.

చనిపోయిన వారి గురించి నేను మాట్లాడలేదు. బైకులు చాక్లెట్స్ ఇచ్చినట్టు పిల్లలకు ఇవ్వలేము. నా కళ్ళముందు హీరోగా వచ్చావు. మంచి పేరు తెచ్చుకున్నావు. మా ఎలక్షన్ లో పోటీ గా నిల్చొని ఓడిపోయావు. అంతేకానీ నువ్వు ఇలాంటి బైట్స్ ఇవొద్దు. మరొకసారి ఇలాంటి వ్యాఖ్యలు నా ముందు చేయడం కరెక్ట్ కాదు జాగ్రత్తగా ఆలోచించుకుని మాట్లాడు అంటూ శ్రీకాంత్ పై తిరిగి ఘాటుగా స్పందించాడు నరేష్. దీంతో వీరి మధ్య జరిగిన వాదనలు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా వీరి మధ్య జరిగిన వాదనల గురించి తెగ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

First published:

Tags: Hero srikanth, Mega Family, Naresh, Sai Dharam Tej, Tollywood

ఉత్తమ కథలు