హోమ్ /వార్తలు /సినిమా /

Kalyan Ram Bimbisara Teaser: కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ టీజర్ విడుదల.. విజువల్ గ్రాండియర్..

Kalyan Ram Bimbisara Teaser: కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ టీజర్ విడుదల.. విజువల్ గ్రాండియర్..

కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ అసలు ఎవరు (Twitter/Photo)

కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ అసలు ఎవరు (Twitter/Photo)

Kalyan Ram Bimbisara Teaser: తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం పాకులాడే హీరోలలో నందమూరి కళ్యాణ్ రామ్‌ కూడా ఉంటాడు. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా కొత్త కథల వైపు ఆయన అడుగులు పడుతుంటాయి. తాజాగా బింబిసార (Kalyan Ram Bimbisara Teaser) తో అదే చేస్తున్నాడు కళ్యాణ్ రామ్.

ఇంకా చదవండి ...

తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం పాకులాడే హీరోలలో నందమూరి కళ్యాణ్ రామ్‌ కూడా ఉంటాడు. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా కొత్త కథల వైపు ఆయన అడుగులు పడుతుంటాయి. ఈ ప్రయత్నంలోనే అతనొక్కడే, పటాస్ లాంటి సంచలన విజయాలు కూడా అందుకున్నాడు కళ్యాణ్ రామ్. తాజాగా ఈయన నుంచి వస్తున్న సినిమా బింబిసార. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వస్తున్న సినిమా ఇది. ఎ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌ అనేది ఈ సినిమా క్యాప్షన్. దీన్నిబట్టే సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఇందులోని విజువల్స్, వాయిస్ ఓవర్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా యాక్షన్ ఎలివేషన్ షాట్స్ అయితే అద్భుతం. కొత్త దర్శకుడు విశిష్ట్ ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా సీన్స్ చిత్రీకరించినట్లు టీజర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఓ సమూహం తాలూకు ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే.. కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గాన్ని చూసి తల వంచి బానిసలు అయితే.. అంటూ సాగిన డైలాగ్స్ అదిరిపోయాయి.

బింబిసార పాత్రకు కళ్యాణ్ రామ్ ప్రాణం పోసాడు. ఆయన చాలా క్రూరంగా కనిపిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ నెత్తుటి సంతకం అన్నట్టు ఉంది టీజర్. నిజానికి చిత్ర యూనిట్ కూడా టీజర్‌కు ఇలాగే ప్రమోషన్ చేసుకుంది. అతను క్రూరమైన వాడు. బార్బేరియన్‌ కింగ్‌ తన భూభాగాన్ని గుర్తించడానికి వస్తున్నాడు అంటూ యూనిట్ ట్వీట్ చేసారు. ఇప్పుడు టీజర్ చూస్తుంటే అదే నిజమని తెలుస్తుంది. మొసలిపై కాలు పెట్టి నడవడం.. అడ్డొచ్చిన వాళ్లను నరికేయడం.. ఈ షాట్స్ అన్నీ చూస్తుంటే సినిమా మరో స్థాయిలో ఉండబోతుందని అర్థమవుతుంది.

పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. చివరి షాట్‌లో ఇప్పటి కళ్యాణ్ రామ్ కూడా కనిపించాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. పాన్ ఇండియన్ స్థాయిలో బింబిసార విడుదల చేస్తున్నాడు నిర్మాత కమ్ హీరో కళ్యాణ్ రామ్. వశిష్ట్‌ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కేథరీన్‌ థ్రెసా, సంయుక్త మేనన్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్నారు. తాజాగా విడుదలైన టీజర్‌తో సినిమాపై అంచనాలు రెండింతలు పెరిగిపోయాయి.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Bimbisara Movie, Kalyan Ram Nandamuri, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు