TOLLYWOOD ACTOR NAGA SHAURYA FATHER SHIVA LINGA PRASAD ARRESTED IN GAMBLING CAE PK
Naga Shaurya father arrest: హీరో నాగ శౌర్య తండ్రి అరెస్ట్.. పేకాట కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు..
నాగ శౌర్య తండ్రి అరెస్ట్ (Naga Shaurya father)
Naga Shaurya father arrest: టాలీవుడ్ హీరో నాగ శౌర్య (Naga Shaurya father arrest) తండ్రి శివలింగ ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని రోజుల కింద మంచిరేవుల ఫామ్ హౌజ్‌లో పేకాట ఆడిస్తున్నట్లు కొన్ని కథనాలు వచ్చాయి. అందులో నాగ శౌర్య తండ్రితో పాటు బాబాయ్ పేరు కూడా బయటికి వచ్చింది.
టాలీవుడ్ హీరో నాగ శౌర్య తండ్రి శివలింగ ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని రోజుల కింద మంచిరేవుల ఫామ్ హౌజ్‌లో పేకాట ఆడిస్తున్నట్లు కొన్ని కథనాలు వచ్చాయి. అందులో నాగ శౌర్య తండ్రితో పాటు బాబాయ్ పేరు కూడా బయటికి వచ్చింది. ఇప్పుడు ఇదే కేసులో నాగ శౌర్య తండ్రిని అరెస్ట్ చేసారు పోలీసులు. శివలింగ ప్రసాద్‌తో కలిసి సుమన్ పేకాట ఆడిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. దాంతో ఈయన్ని కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసు గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. క్యాసినో కింగ్‌పిన్ గుత్తా సుమన్‌తో కలిసి కొన్ని రోజులుగా నాగ శౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ పేకాట దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. దాంతో ఈయన అరెస్టు అనివార్యమైంది. ఈ కేసులో శివలింగ ప్రసాద్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్నమొన్నటి వరకు నాగ శౌర్య తండ్రి పేరు ఈ కేసులో కాస్త తక్కువగానే వినిపించింది. అయితే ఇప్పుడు పోలీసులు సేకరించిన ఆధారాలతో ఆయన పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది. సిటీ శివారులోని నాగశౌర్య ఫామ్ హౌస్‌లో పేకాట నిర్వహిస్తుండగా పోలీసులు దాదాపు 30 మందిని పట్టుకున్నారు. శ్రీరామ్ భద్రయ్య లాంటి మాజీ ఎమ్మెల్యేలతో పాటు.. నిజామాబాద్, విజయవాడ లాంటి ప్రాంతాల నుంచి వచ్చిన బడాబాబులూ కూడా అందులో ఉన్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.