Home /News /movies /

TOLLYWOOD ACTOR NAGA BABU KONIDELA SHOCKING WHATSAPP DP WAS VIRAL ON INTERNET NR

Naga Babu Konidela: నాగబాబు వాట్సాప్ డిపి చూశారా.. చూస్తే షాక్ అవ్వడం ఖాయం!

Naga Babu Konidela

Naga Babu Konidela

Naga Babu Konidela: తెలుగు సినీ నటుడు, మెగా బ్రదర్ నాగబాబు గురించి అందరికీ తెలిసిందే. ఈయన ఎన్నో సినిమాల్లో నటించి తన నటనకు మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

    Naga Babu Konidela: తెలుగు సినీ నటుడు, మెగా బ్రదర్ నాగబాబు గురించి అందరికీ తెలిసిందే. ఈయన ఎన్నో సినిమాల్లో నటించి తన నటనకు మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా పలు సినిమాలలో అతిధి పాత్రల్లో కూడా మెప్పించారు. ఇక ఈయన జనాల్లో ముక్కుసూటి మనిషి గా ఓ పేరును అందుకున్నాడు. ఇక ఈయన అవతలి వారితో హాస్యంగా కూడిన వెటకారంతో మాట్లాడుతుంటారు. ఇక నాగబాబు సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా యాక్టివ్ గా మారారు.

    ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో నుండి జడ్జిగా ప్రేక్షకులకు మరింత దగ్గరగా పరిచయమైన నాగబాబు.. ఆ తర్వాత జబర్దస్త్ నుండి అదిరింది షోలో మారిన సంగతి తెలిసిందే. ఇక ఈ షో నాగబాబు కు అంత గుర్తింపు ఇవ్వకపోగా.. ఈ షో కూడా మధ్యలో ఆగిపోయింది. ఇక సోషల్ మీడియాలో మాత్రం నాగబాబు తన వెటకారపు మాటలతో, సెటైర్లతో బాగా బిజీగా ఉంటాడు. అంతే కాకుండా తన వ్యక్తిగత విషయాలను, కుటుంబం సంబంధించిన ఫోటోలను తెగ షేర్ చేస్తూ ఉంటాడు.

    ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో కొందరి అభిమానులతో తెగ ముచ్చటించారు. అందులో ఓ నెటిజన్ నాగబాబు వాట్సాప్ డిపి ని అడుగగా వెంటనే నాగబాబు కాదనకుండా తన వాట్స్అప్ డిపి ని షేర్ చేశాడు. ఇక ఇది చూసిన నెటి జనులు షాక్ అవ్వగా.. ఆ డిపి లో.. ఆయన ఎప్పుడు విమర్శించే ఇద్దరి ఫోటోలు ఉన్నాయి. ఇంతకు వాళ్ళు ఎవరో కాదు.. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, హీరో నందమూరి బాలకృష్ణ.

    Naga Babu Konidela shocking whatsapp dp
    Naga Babu Konidela shocking whatsapp dp


    ఆ మధ్య బాలకృష్ణ అంటే ఎవరో అని కూడా తెలియదని నాగబాబు అనగా ఈ విషయం అప్పట్లో తెగ చర్చగా మారింది. అంతేకాకుండా రామ్ గోపాల్ వర్మ టార్గెట్ చేస్తూ తెగ కామెంట్లను కూడా చేస్తుంటాడు. ఇక వీరిద్దరి డిపి అని ఈ ఫోటోని షేర్ చేయగా ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. మరి ఈ ఫోటో తను కావాలని షేర్ చేశాడా లేక వాళ్లని మరింతగా రెచ్చగొట్టడానికి షేర్ చేశాడా అని ఇప్పటి వరకు తెలియలేదు.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Mega Family, Naga Babu Konidela, Nandamuri balakrishna, Ram Gopal Varma

    తదుపరి వార్తలు