Murali Mohan land scam case: మురళీ మోహన్ భూ వివాదం కేసు.. హై కోర్టు సంచలన తీర్పు..

మురళీ మోహన్ (Twitter/Photo)

Murali Mohan land scam case: ప్రముఖ సినీ నటుడు, మాజీ రాజకీయ నాయకుడు మురళీ మోహన్‌పై (Murali Mohan land fraud case) కొన్నాళ్ల కింద నమోదైన భూ వివాదం కేసుకు సంబంధించిన తీర్పు హై కోర్టు వెలువరించింది.

  • Share this:
ప్రముఖ సినీ నటుడు. మాజీ రాజకీయ నాయకుడు మురళీ మోహన్‌పై కొన్నాళ్ల కింద నమోదైన భూ వివాదం కేసుకు సంబంధించిన తీర్పు హై కోర్టు వెలువరించింది. ఈ తీర్పుతో మురళీ మోహన్ కుటుంబ సభ్యులు పూర్తిస్థాయిలో సంతోషంలో మునిగిపోయారు. ఈయన భూమి తీసుకొని మోసం చేసాడని కేసు నమోదైంది. తన దగ్గర స్థలం తీసుకొని మోసం చేశారంటూ సదరు భూమి యజమాని ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. దాంతో మురళీ మోహన్‌పై 41A సెక్షన్ కింద నోటీసులు జారీ చేసారు సీఐడీ అధికారులు. ఈ కేసులో ఆగస్ట్ 5 గురువారం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే సీఐడీ ఇచ్చిన నోటీసులపై మురళీ మోహన్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు హై కోర్టును ఆశ్రయించారు.

ఈ మేరకు న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మురళీ మోహన్ తరపున ఈ కేసులో సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. సివిల్ వివాదాన్ని కావాలనే క్రిమినల్ వివాదంగా మార్చారని ఆయన కోర్టులో వాదించారు. తనను మోసం చేసారని సదరు వ్యక్తి చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన తెలిపారు.
murali mohan,murali mohan twitter,murali mohan jayabheri land fraud case,murali mohan ap high court,murali mohan jayabheri land case ap high court judgement,telugu cinema,మురళీ మోహన్,మురళీ మోహన్ భూ వివాదం,జయభేరి భూ వివాదం కేసులో ఏపీ హై కోర్టు సంచలన తీర్పు
మురళీ మోహన్ (Murali Mohan)

ఆ వ్యక్తితో జయభేరి సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందం ఏ మాత్రం ఉల్లంఘించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు లాయర్ దమ్మాలపాటి శ్రీనివాస్. వాదోపవాదాలు విన్న న్యాయస్థానం.. ఈ కేసులో సీఐడీ తీసుకోవాలనుకున్న తదుపరి చర్యలు వెంటనే నిలిపేయాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో మురళీ మోహన్ కుటుంబానికి ఊరట లభించింది.
Published by:Praveen Kumar Vadla
First published: