Home /News /movies /

TOLLYWOOD ACTOR MOHAN BABU STRONG WARNING TO MAA MEMBERS WHO GOING FOR MEDIA INTERVIEWS WITHOUT PERMISSION PK

MAA Elections - Mohan Babu: మా సభ్యులకు మోహన్ బాబు స్ట్రాంగ్ వార్నింగ్.. అధ్యక్షుడి అనుమతి లేకుండా అలా చేస్తే..!

మోహన్ బాబు (Mohan Babu)

మోహన్ బాబు (Mohan Babu)

MAA Elections - Mohan Babu: మంచు కుటుంబం అంటే క్రమశిక్షణకు మారుపేరు. మోహన్ బాబు గురించి కొత్తగా చెప్పాల్సిందేం లేదు. ఆయన అలాగే ఉంటాడు.. అందర్నీ తనలాగే ఉండాలంటాడు. విష్ణు అధ్యక్షుడు అయినా కూడా వెనకుండి నడిపించేది మాత్రం మోహన్ బాబు (MAA Elections - Mohan Babu) అని తెలియంది కాదు.

ఇంకా చదవండి ...
మా ఎలక్షన్స్‌లో ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాలా..? రెండు తెలుగు రాష్ట్రాలు కళ్లారా చూసాయి. కేవలం 900 మంది ఓటర్లు.. అందులో ఓటేసింది 650.. చెల్లనివి 50 ఓట్లు. అంటే ఎన్నికలు జరిగింది కేవలం 600 మంది ఓటర్లతోనే అన్నమాట. వీటి కోసమే గత మూడు నెలలుగా రచ్చ జరుగుతుంది. నువ్వా నేనా అనే పోటీ జరుగుతుంది. ఓవైపు మంచు విష్ణు.. మరోవైపు ప్రకాష్ రాజ్ ప్యానెల్స్ చివరి వరకు కొట్టుకున్నాయి కూడా. మాటల తూటాలు కూడా బాగానే పేల్చుకున్నాయి. ఇదంతా ఇలా ఉంటే ఎన్నికల వరకే ఇదంతా జరుగుతుంది. ఒక్కసారి ఎలక్షన్స్ అయిపోయాయంటే చాలు అంతా ఒక్కటైపోతుంటారు. ఇంకా చెప్పాలంటే ఎన్నికల కంటే ముందే పోలింగ్ రోజే ఒక్కటైపోయాయి రెండు ప్యానెల్స్. అటు ప్రకాష్ రాజ్, ఇటు విష్ణు ఇద్దరూ కౌగిలించుకుని మరీ పోజులిచ్చారు. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ప్రకాష్ రాజ్ ఆప్యాయంగా విష్ణును హత్తుకుని కంగ్రాట్స్ చెప్పాడు.

ప్రత్యేకంగా మెసేజ్ కూడా పంపించాడు. మీ తెలుగు బిడ్డను గెలిపించుకున్నారంటూ చెప్పుకొచ్చాడు ప్రకాష్. అయితే మంచు విష్ణు గెలిచిన తర్వాత ఆ ప్యానెల్‌లోని సభ్యులు మాట్లాడుతూ.. ఇకపై కొత్త మా వర్గాన్ని చూడబోతున్నారని స్పష్టం చేసారు. ముఖ్యంగా మంచు కుటుంబం అంటే క్రమశిక్షణకు మారుపేరు. మోహన్ బాబు గురించి కొత్తగా చెప్పాల్సిందేం లేదు. ఆయన అలాగే ఉంటాడు.. అందర్నీ తనలాగే ఉండాలంటాడు. ఇప్పుడు విష్ణు అధ్యక్షుడు అయినా కూడా వెనకుండి నడిపించేది మాత్రం మోహన్ బాబు అని తెలియంది కాదు. తన బిడ్డకు అందరి ఆశీర్వాదాలు ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు మోహన్ బాబు.

Tollywood Couple divorce: విడాకుల దిశగా మరో టాలీవుడ్ జంట.. ఎవరి బతుకు వాళ్లదే అంటున్న ఆ యువ హీరో..


అంతా బాగానే ఉంది కానీ గెలిచిన కొన్ని నిమిషాల్లోనే కొందరికి వార్నింగ్ ఇచ్చాడు కలెక్షన్ కింగ్. ఇప్పట్నుంచి అధ్యక్షుడికి తెలియకుండా ఎక్స్ ట్రాలు చేస్తే తోకలు కట్ అయిపోతాయనే స్థాయిలో చెప్పాడు ఈయన. మీడియా ముందుకు వెళ్లి మా సభ్యులు కొందరు ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉంటారు. వాళ్లు నోరు జారుతుంటే వాటిని కవర్ చేయడానికి మిగిలిన మా సభ్యులు తలలు పట్టుకుంటుంటారు. చాలా ఏళ్ళుగా ఇదే జరుగుతుంది.

Chiranjeevi - Mohan Babu: ఈ విజయం దేనికి సంకేతం.. చిరంజీవిపై మోహన్ బాబు విజయమా ఇది..?


అయితే ఇకపై అలా జరగడానికి వీళ్లేదంటూ వార్నింగ్ ఇచ్చాడు మోహన్ బాబు. మా అసోసియేషన్ అధ్యక్షుడు అనుమతి లేకుండా ఎవరు కూడా మీడియా ముందుకు వెళ్లడానికి వీల్లేదంటూ అల్టిమేటం జారీ చేసాడు మోహన్ బాబు. ముఖ్యంగా మా ఆడపడుచులకు ఇది చెప్తున్నాను అంటూ క్లారిటీ ఇచ్చాడు కలెక్షన్ కింగ్. ఈ వార్నింగ్ మోహన్ బాబు ఎవరికి ఇచ్చాడబ్బా అంటూ అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. మాట్లాడితే మీడియా ముందుకు వచ్చే మా సభ్యులు ఎవరో వాళ్ళకే ఈ వార్నింగ్ అంటున్నారు విష్ణు ప్యానెల్.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: MAA Elections, Manchu mohan babu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు