TOLLYWOOD ACTOR MOHAN BABU SREE VIDYANIKETHAN NOW PROMOTED AS MOHAN BABU UNIVERSITY PK
Mohan Babu University: మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ కాలేజ్‌కు ‘యూనివర్సిటీ’ హోదా..
మోహన్ బాబు తిరుపతి కాలేజ్ (mohan babu university)
Mohan Babu University: తెలుగు ఇండస్ట్రీలో మోహన్ బాబు (Mohan Babu University) కేవలం నటుడు మాత్రమే కాదు.. మంచి విద్యావేత్త కూడా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండున్నర దశాబ్దాలుగా ఈయన కులమతాలకు అతీతంగా 25 శాతం రిజర్వేషన్స్ ఇచ్చి విద్య అందిస్తున్నాడు మోహన్ బాబు.
తెలుగు ఇండస్ట్రీలో మోహన్ బాబు కేవలం నటుడు మాత్రమే కాదు.. మంచి విద్యావేత్త కూడా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండున్నర దశాబ్దాలుగా ఈయన కులమతాలకు అతీతంగా 25 శాతం రిజర్వేషన్స్ ఇచ్చి విద్య అందిస్తున్నాడు మోహన్ బాబు. ఇదిలా ఉంటే చాలా రోజులుగా ఈ సీనియర్ నటుడు వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది. తాజాగా ఈయన శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలకు యూనివర్సిటీ హోదా వచ్చింది. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మోహన్ బాబు. ‘చిన్న మొక్కగా మొదలైన శ్రీ విద్యానికేతన్ ఈ రోజు విద్యా కల్పవృక్షంగా మారింది. 30 ఏళ్ళ మీ నమ్మకం, నా జీవితపు కృషి, ధ్యేయం ఈ రోజు నెరవేరాయి. ఈ విద్యాసంస్థను యూనివర్సిటీగా మార్చేసాయి. తిరుపతిలో ఇప్పటి నుంచి మోహన్ బాబు యూనివర్సిటీ ఉంటుంది. మీ ప్రేమ, అండదండలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయని కోరుకుంటూ’ మీ మోహన్ బాబు అంటూ ట్వీట్ చేసాడు ఈయన.
ఈ విషయం తెలుసుకుని మోహన్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో కంగ్రాట్స్ చెప్తున్నారు. ఇదిలా ఉంటే హీరోగా బిజీగా ఉన్న సమయంలోనే నిర్మాతగా కూడా మారారు మోహన్ బాబు. లక్ష్మీ ప్రసన్న బ్యానర్లో దాదాపు 50 సినిమాలకు పైగానే నిర్మించారు. నటుడు, నిర్మాత తర్వాత ఎవరూ ఊహించని విధంగా ఆయన విద్యావేత్తగా మారిపోయారు. 1993లో శ్రీ విద్యానికేతన్ మొదలుపెట్టారు. అప్పుడు చిన్న మొక్కగానే మొదలైన ఈ విద్యాసంస్థ ఇప్పుడు యూనివర్సిటీగా మారిపోయింది. అందులోనే శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషన్ స్కూల్, కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఫార్మసీ, పిజి కాలేజ్ సముదాయం ఉంది. ఇన్ని ఉన్నాయి కాబట్టే చాలా రోజుల నుంచి తన విద్యాసంస్థకు యూనివర్సిటీ హోదా కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు మోహన్ బాబు. ఇన్నాళ్లకు ఆయన కల నెరవేరింది. శ్రీ విద్యానికేతన్ ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీగా మారడంతో సంతోషంలో మునిగిపోయారు మంచు అభిమానులు. అలాగే యూనివర్సిటీ విద్యార్థులకు కూడా ఇకపై అవకాశాలు మెండుగా ఉంటాయంటున్నారు విశ్లేషకులు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.