Mohan Babu - Shiva Balaji wife: ఏయ్ అమ్మాయి ఏంటిది.. నటుడు శివబాలాజీ భార్యపై మోహన్ బాబు సీరియస్..

మోహన్ బాబు మధుమిత (Mohan Babu Madhumita)

Mohan Babu - Shiva Balaji wife: మోహన్ బాబు, విష్ణు సహా చాలా మంది మా సభ్యులు తాజాగా ఓ వేడుకకు హాజరయ్యారు. అందులో మోహన్ బాబు (Mohan Babu - Shiva Balaji wife) మరోసారి ఇండస్ట్రీలో జరుగుతున్న పరిస్థితుల గురించి సీరియస్ అయ్యారు. ముఖ్యంగా తనయుడు విష్ణు మా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసాక జోరు పెంచేసారు మోహన్ బాబు.

  • Share this:
మా ఎన్నికలు పూర్తైన తర్వాత కూడా ఇప్పటికీ దాని గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ బయటికి వచ్చినా కూడా దాని గురించే మీడియా కూడా అడ్రస్ చేస్తుంది. దాంతో వాటి గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు అక్కడున్న వాళ్లు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. తాజాగా మోహన్ బాబు, విష్ణు సహా చాలా మంది మా సభ్యులు ఓ వేడుకకు హాజరయ్యారు. అందులో మోహన్ బాబు మరోసారి ఇండస్ట్రీలో జరుగుతున్న పరిస్థితుల గురించి సీరియస్ అయ్యారు. ముఖ్యంగా తనయుడు విష్ణు మా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరింత జోరు పెంచేసారు మోహన్ బాబు. సినిమా ఇండస్ట్రీలోని పెద్దలతో పాటు రాజకీయ ప్రముఖులను కూడా కలిసారు. తనయుడికి అన్ని విధాలుగా అండదండగా నిలుస్తున్నారు కలెక్షన్ కింగ్. ఇదిలా ఉంటే తాజా వేడుకలో నటుడు శివబాలాజీ భార్య మధుమితపై సీరియస్ అయ్యారు మోహన్ బాబు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం ఏంటంటే..ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్‌ నటుడు మోహన్‌ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్న సమయంలో నటుడు శివబాలాజీ భార్య మధుమిత వెనకాల ఏదో గుసగుసలాడుతూ కనిపించింది. దాంతో వెంటనే సీరియస్‌ అయ్యారు మోహన్ బాబు. మాట్లాడుతున్న స్పీచ్‌ ఆపి మరీ మధ్యలోనే ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది.

Bigg Boss 5 Telugu Elimination: యాంకర్ రవి ఖాతాలో మరొకరు బలి.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?

'నా జీవితం తెరిచిన పుస్తకం.. నా పుస్తకంలో విలన్‌గా చెయ్యాలని అనుకున్నాను.. విలన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, హీరోగా చేశాను.. మనమంతా ఒకే తల్లి బిడ్డలం.. మనుషుల్లో టాలెంట్‌ ఉంటే అవకాశాలు వస్తాయి.. కేవలం టాలెంట్‌తోనే ఇక్కడ కొనసాగుతారు.. ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి. అది తప్ప రాజకీయాలు చేస్తే కాదు. అయినా ఇది రాజకీయ వేదిక కాదు. పాలిటిక్స్‌లో కంటే ఇక్కడే ఎక్కువ జరుగుతున్నాయి. ఇలాంటివి కూడా ఉంటాయా.. ఇలా కూడా జరుగుతుందా అని ఈ మధ్య జరిగిన కొన్ని పరిస్థితులను చూసి నేను ఆశ్చర్యపోయాను' అని మోహన్‌ బాబు తెలిపారు.

Chiranjeevi: చిరంజీవి చెంప పగలగొట్టిన ఆ సీనియర్ హీరోయిన్.. ట్విస్ట్ తెలిస్తే షాక్ తప్పదు..!


నాటి ఎస్వీ రంగారావు నుంచి నేటి మా అసోసియేషన్ ఎన్నికల వరకు అన్నీ చెప్పుకుంటూ వచ్చారు మోహన్ బాబు. అయితే ఆయన మాట్లాడుతున్న సమయంలోనే వెనకాల నుంచి మధుమిత వాయిస్ రావడంతో సీరియస్ అయ్యారు ఈయన. పెద్దలు మాట్లాడుతున్నపుడు సైలెంట్‌గా ఉండాలి.. ఇలాంటివి నాకు నచ్చవు.. ఏయ్ అమ్మాయి అంటూ సీరియస్ అయ్యారు ఈయన. ఇలాంటి బ్రేకులు వస్తే ముఖ్యమైన విషయాలు మాట్లాడుతున్నపుడు ఆపాల్సి వస్తుందని చెప్పారు ఈయన.
Published by:Praveen Kumar Vadla
First published: